లిబియా మాజీ నేత గడాఫీ కుమారుడి హత్య..
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:51 AM
లిబియా ఒకప్పటి నియంత గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురవడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సయిఫ్‌ను కాల్చి చంపారు.
లిబియా ఒకప్పటి నియంత గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురవడం సంచలనంగా మారింది. గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సయిఫ్‌ను కాల్చి చంపారు. ఈ విషయాన్ని సయిఫ్ సలహాదారుడు మీడియాకు వెల్లడించారు (Saif Gaddafi killed).
గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు జింటాన్‌లోని గడాఫీ ఇంట్లోకి ఆయుధాలతో చొరబడ్డారని సయిఫ్ సలహాదారుడు వెల్లడించారు. ఇంట్లోని నిఘా కెమెరాలను ధ్వంసం చేసి, సయిఫ్‌ను కాల్చి చంపారని తెలిపారు. అయితే ఈ హత్య వెనుక ఎవరున్నారనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గడాఫీ మరణం తర్వాత సయిఫ్ లిబియా రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు (Libya Gaddafi son death).
2021లో లిబియా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు సయిఫ్ ప్రకటించారు (Libya home killing). అయితే పలు కారణాల వల్ల ఆ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కాగా, కొన్ని రోజుల ముందు తన భద్రత గురించి స్నేహితుడి వద్ద సయిఫ్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. భయపడినట్టుగానే ఆయనను కొందరు దుండగులు హత్య చేసి చంపేశారు.
ఇవి కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం.. మరింత తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఉక్రెయిన్‌తో శాంతి చర్చలు.. దాడులు తీవ్రతరం చేసిన రష్యా..