నార్త్ కొరియాలో వేడెక్కుతున్న కుటుంబ రాజకీయాలు.. అత్త వర్సెస్ కోడలు..
ABN , Publish Date - Feb 16 , 2026 | 02:57 PM
ఉత్తర కొరియాలో కుటుంబ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిస్థితి అత్త వర్సెస్ కోడలిగా మారింది. అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన కూతురు కిమ్ జు యేను తన స్థానంలో దేశాధినేతను చేయాలని చూస్తున్నారట. మరోవైపు దేశాధినేత పదవి కోసం కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జంగ్ కూడా పావులు కదుపుతున్నారట..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ఉత్తర కొరియాలో కుటుంబ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పరిస్థితి అత్త వర్సెస్ కోడలిగా మారింది. సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కథనం ప్రకారం.. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన స్థానంలో కూతురు కిమ్ జు యేను దేశాధినేతను చేయాలని చూస్తున్నారు. కిమ్ జు యే వయసు ప్రస్తుతం 13 ఏళ్లు. కొన్నేళ్ల నుంచి ఆమె తండ్రితో కలిసి హై ప్రొఫైల్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో చైనాలోని బీజింగ్‌లో జరిగిన కార్యక్రమానికి కూడా తండ్రితో కలిసి వెళ్లారు.
మరికొన్ని రోజుల్లో ఉత్తర కొరియాలో అతిపెద్ద, ముఖ్యమైన రాజకీయ సమ్మేళనం జరగబోతోంది. ఈ రాజకీయ సమ్మేళనంలో తండ్రితో కలిసి కిమ్ జు యే కూడా పాల్గొనే అవకాశం ఉంది. 2022లో మొదటిసారి కిమ్ జు యే తండ్రితో కలిసి పబ్లిక్ ఈవెంట్‌లో కనిపించారు. ఆ ఏడాది నవంబర్ నెలలో జరిగిన లాంగ్ రేంజ్ మిస్సైల్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఇక అప్పటి నుంచి తరచూ తండ్రితో కలిసి పబ్లిక్ ఈవెంట్స్‌లో పాల్గొంటూనే ఉన్నారు. ఆయుధాల టెస్ట్‌లు, మిలిటరీ పరేడ్స్, ఫ్యాక్టరీ విజిట్స్ ఇలా అన్ని చోట్లకు వెళ్తున్నారు. కిమ్ జోంగ్ ఉన్ తన కూతుర్ని దేశాధినేతను చేయడానికే ఇలా అన్ని చోట్లకూ తీసుకెళ్తున్నారని సౌత్ కొరియా నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చెప్పుకొచ్చింది.
అత్త వర్సెస్ కోడలు..
ఉత్తర కొరియాలో అధినేత కిమ్ జోంగ్ ఉన్ తర్వాత శక్తివంతమైన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా కిమ్ యో జంగ్ అనే చెప్పాలి. 38 ఏళ్ల కిమ్ యో జంగ్‌కు రాజకీయ పరంగానే కాకుండా మిలిటరీ పరంగా కూడా పట్టు ఉంది. ప్రస్తుతం ఆమె వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియాలో కీలక పదవిలో ఉన్నారు. సోదరుడిపై కూడా ఆమె ప్రభావం చాలా ఉంది. అవకాశం ఉందని తెలిస్తే దేశాధినేత పదవిని సొంతం చేసుకోవడానికి కిమ్ యో జంగ్ ఏమాత్రం ఆలోచించదని సౌత్ కొరియన్ ఇంటెలిజెన్స్ అధికారి రా జోంగ్ ఇల్ తెలిపారు. పదవిని సొంతం చేసుకోకుండా ఆమెను అడ్డుకోవటం కష్టమని ఆయన తేల్చి చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఓవర్ నైట్ స్టార్ ఐరా రావత్.. ఇంతకీ ఈమె ఎవరంటే?
కేసీఆర్, కేటీఆర్‌లను సీఎం రేవంత్ ఎందుకు కాపాడుతున్నారో అర్థమైంది: ఎంపీ అర్వింద్