Share News

అప్రమత్తంగా ఉండండి.. ఇళ్లలోనే ఉండండి.. సౌదీలో భారతీయులకు కీలక సూచనలు..

ABN , Publish Date - Oct 08 , 2026 | 09:41 PM

సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కోరింది.

అప్రమత్తంగా ఉండండి.. ఇళ్లలోనే ఉండండి.. సౌదీలో భారతీయులకు కీలక సూచనలు..
Saudi Arabia Houthi attacks

ఇంటర్నెట్ డెస్క్: సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. అక్కడ నివసిస్తున్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్లలోనే ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసే సూచనలను తప్పకుండా పాటించాలని కోరింది. సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని యెమెన్‌కు చెందిన హౌతీలు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం ఈ సూచనలు చేసింది (Indians in Saudi Arabia).


ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సౌదీ అరేబియాలో ఉన్న భారతీయులు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, స్థానిక అధికారులు జారీ చేసే భద్రతా సూచనలను పాటించాలని సూచించింది. అలాగే జరుగుతున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు లేదా వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం, తిరిగి ప్రచారం చేయడం వంటివి చేయవద్దని భారతీయులను కోరింది (Saudi Arabia Houthi attacks).


గురువారం సౌదీ రాజధాని రియాద్‌లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పేలుళ్లు సంభవించాయి ( Indian Embassy Saudi Arabia advisory). ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీలు ప్రకటించారు. దీనికి ముందు అబ్హా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయాలపై దాడులు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం ముగ్గురు మరణించగా, 36 మంది గాయపడ్డారు. కాగా, సౌదీ విమానాశ్రయాలపై జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి..

ఢిల్లీలో ప్రతిపక్షాల నిరసన.. మోదీ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వ్యక్తిపై దాడి..


సెన్సెక్స్ 1,100 పాయింట్లు పతనం.. రూ.8 లక్షల కోట్లు ఆవిరి..

Updated Date - Oct 08 , 2026 | 09:41 PM