Share News

9 నెలల్లో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. ఆస్ట్రేలియాలో భారతీయుడికి 14 ఏళ్ల జైలు..

ABN , Publish Date - May 17 , 2026 | 06:07 PM

భారతీయ మూలాలున్న మసాజ్ థెరపిస్ట్ సుమిత్ సతీష్ రస్తోగీకి ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కోర్టు దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు తొమ్మిది నెలల వ్యవధిలో 61 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు తేల్చింది.

9 నెలల్లో 61 మంది మహిళలపై లైంగిక వేధింపులు.. ఆస్ట్రేలియాలో భారతీయుడికి 14 ఏళ్ల జైలు..
Indian massage therapist Australia

భారతీయ మూలాలున్న మసాజ్ థెరపిస్ట్ సుమిత్ సతీష్ రస్తోగీకి ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కోర్టు దాదాపు 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అతడు తొమ్మిది నెలల వ్యవధిలో 61 మంది మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్టు తేల్చింది. అసభ్య వీడియోలు చిత్రీకరణ వంటి నేరాలకు పాల్పడినట్లు కోర్టు నిర్ధారించింది (Indian massage therapist Australia).


సుమిత్ 2011లో భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి ఓ మసాజ్ పార్లర్‌‌ను ప్రారంభించాడు. 2021 అక్టోబర్ నుంచి 2022 జులై మధ్య ఆ మసాజ్ పార్లర్‌కు వచ్చిన 61 మంది మహిళలను లైంగికంగా వేధించాడు. 55 మంది మహిళల ప్రైవేట్ వీడియోలను రహస్యంగా రికార్డు చేశాడు. దీనిపై బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు (Indian-origin therapist jailed).


కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు (Adelaide abuse case). సరైన పత్రాలు లేకుండానే సుమిత్ మసాజ్ పార్లర్‌ను నడుపుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. 2022 నుంచి ఈ కేసుపై కోర్టులో విచారణ సాగుతోంది. చివరకు సుమిత్ తన తప్పును అంగీకరించడంతో తాజాగా దక్షిణ అస్ట్రేలియా జిల్లా కోర్టు అతడికి 13 ఏళ్ల 10 నెలల జైలు శిక్షను విధించింది.


ఇవి కూడా చదవండి..

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..


మరో వివాదంలో కాశ్ పటేల్.. ప్రేయసితో డేట్ కోసం ఎంత ఖర్చంటే..

Updated Date - May 17 , 2026 | 06:15 PM