బ్రిటన్ క్యాబినెట్‌లో భారతీయుడు
ABN , Publish Date - Jul 22 , 2026 | 06:16 AM
బ్రిటన్ నూతన ప్రధానిగా నియామకమైన ఆండీ బర్న్‌హమ్ తన క్యాబినెట్‌లో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. బిహార్‌కు చెందిన కనిష్క్ నారాయణ్‌కు.. బ్రిటన్ దేశపు..
తొలి ఏఐ మంత్రిగా బిహార్
మూలాలున్న కనిష్క్ నారాయణ్
లండన్, జూలై 21: బ్రిటన్ నూతన ప్రధానిగా నియామకమైన ఆండీ బర్న్‌హమ్ తన క్యాబినెట్‌లో భారత సంతతి వ్యక్తికి కీలక బాధ్యతలు అప్పగించారు. బిహార్‌కు చెందిన కనిష్క్ నారాయణ్‌కు.. బ్రిటన్ దేశపు తొలి కృత్రిమ మేధ(ఏఐ) మంత్రిగా పదోన్నతి కల్పించారు. బ్రిటన్ చరిత్రలోనే తొలిసారిగా ఏఐ విభాగానికి క్యాబినెట్ స్థాయి హోదా కల్పిస్తూ.. ఆ బాధ్యతలను కని్‌ష్కకు అప్పగించడం గమనార్హం. బీహర్‌లోని ముజఫర్‌పూర్‌లో జన్మించిన కనిష్క్, తన 12వ ఏట కుటుంబంతో కలిసి బ్రిటన్‌లోని వేల్స్‌కు వలస వచ్చారు. 2024 బ్రిటన్ ఎన్నికల్లో వేల్స్ నుంచి లేబర్ పార్టీ ఎంపీగా గెలిచి, ఆ ప్రాంతం నుంచి ఎన్నికైన తొలి భారతీయ మూలాలున్న వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2025 కీర్ స్టార్మర్ ప్రభుత్వంలో ఆన్‌లైన్ భద్రత, కృతిమ మేధ విభాగ సహాయ మంత్రిగా పని చేశారు. ప్రస్తుత ప్రధాని బర్న్‌హమ్ కని్‌ష్కకు పదోన్నతి కల్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ప్రభుత్వ అధీనంలోనే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు
తప్పిపోయి.. జొన్నచేనులో నిద్రపోయి..!