భారత్తో సంబంధాలు మరింత బలోపేతం: అజెర్బైజాన్ విదేశాంగ మంత్రి
ABN , Publish Date - Oct 23 , 2026 | 08:31 PM
భారత్–అజెర్బైజాన్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని అజెర్బైజాన్ విదేశాంగ మంత్రి జెహాన్ బేరమోవ్ ధీమా వ్యక్తం చేశారు.
బాకూ (అజెర్బైజాన్), అక్టోబర్ 23: భారతదేశంతో ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని అజెర్బైజాన్ విదేశాంగ మంత్రి జెహాన్ బేరమోవ్ ధీమా వ్యక్తం చేశారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అజెర్బైజాన్ రాజధాని బాకూ పర్యటన సందర్భంగా ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసింది.
ఇరు దేశాల మధ్య ఇంధనం, ఔషధ రంగాలు (ఫార్మాస్యూటికల్స్), వ్యవసాయం, రవాణా కారిడార్ల విస్తరణపై విస్తృతంగా చర్చించారు. రెండు దేశాల మధ్య వార్షిక వాణిజ్యం ప్రస్తుతం అరవై కోట్ల డాలర్లకు (USD 600 Million) చేరిందని, అయితే ఇది ఇరు దేశాల అసలు సామర్థ్యం కంటే తక్కువగా ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
అజెర్బైజాన్లోని ప్రధాన చమురు, గ్యాస్ ప్రాజెక్టులలో భారతదేశానికి చెందిన ఓఎన్జీసీ (ONGC) తన భాగస్వామ్యాన్ని పెంచుకుందని, అలాగే వెయ్యికి పైగా భారతీయ కంపెనీలు అక్కడ క్రియాశీలకంగా పనిచేస్తున్నాయని వెల్లడించారు.
బాకూ, ఢిల్లీ మధ్య రెండు ప్రత్యక్ష విమాన సర్వీసులు నడుస్తున్నాయని, ఈ సంవత్సరం సుమారు ఐదువందల మంది భారతీయ విద్యార్థులు అజెర్బైజాన్ ఉన్నత విద్యాసంస్థల్లో చేరారని బేరమోవ్ తెలిపారు.
ఆర్మేనియా-అజెర్బైజాన్ శాంతి చర్చలు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఇరు మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
అజెర్బైజాన్ అధ్యక్షుడితో జైశంకర్ భేటీ
విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.. అజెర్బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయెవ్తో భేటీ అయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి అధ్యక్షుడు చూపుతున్న సానుకూల దృక్పథాన్ని జైశంకర్ కొనియాడారు. (India Azerbaijan Relations)
ఇవి కూడా చదవండి:
పారా ఆసియా క్రీడల్లో భారత్కు మరో రెండు స్వర్ణాలు
వన్డేల్లో జో రూట్ అరుదైన రికార్డు.. ఇంగ్లాండ్ తరఫున తొలి బ్యాటర్ గా..
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. గిల్ రికార్డు బ్రేక్