Share News

నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. జడ్జిల తీరుపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం..

ABN , Publish Date - Mar 24 , 2026 | 07:46 PM

తనను బ్లాక్ మెయిల్ చేయడానికి తన భార్యను ఓ సాధనంగా వాడుకుంటున్నారని పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై ఆ దేశ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ న్యాయమూర్తులు తమ వ్యక్తిగత లాభం కోసం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

నా భార్యను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. జడ్జిల తీరుపై ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం..
Imran Khan

తనను బ్లాక్ మెయిల్ చేయడానికి తన భార్యను ఓ సాధనంగా వాడుకుంటున్నారని పాకిస్థాన్ న్యాయవ్యవస్థపై ఆ దేశ మాజీ ప్రధాని, క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ న్యాయమూర్తులు తమ వ్యక్తిగత లాభం కోసం అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ ఖాన్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మరోవైపు ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ కూడా జైలు జీవితం గడుపుతూ అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు (Imran Khan Eid call).


'పాకిస్థాన్‌లోని న్యాయమూర్తులు తమ వ్యక్తిగత లాభం కోసం మాకు అన్యాయం చేస్తున్నారు. వాళ్లందరూ సిగ్గుపడాలి. మేం పదే పదే న్యాయవ్యవస్థను ఆశ్రయిస్తున్నాం. అయినా వారు అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. నన్ను లొంగదీసుకోలేమని వారికి తెలుసు. అందుకే నా భార్యను అడ్డుపెట్టుకుని నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. నన్ను బెదిరించడం కోసమే, బుష్రా బీబీ చికిత్స విషయంలో అమానుషంగా వ్యవహరిస్తున్నారు' అని ఈద్ సందర్భంగా తనను కలిసిన కుమారుడు ఖాసింతో చెప్పారు (Imran Khan jail update).


'బుష్రా బీబీని జైలులో ఒంటరిని చేశారు (Imran Khan news). ఆమెను పూర్తిగా ఐసోలేషన్‌లో ఉంచారు. నాతో మాట్లాడడానికి వారానికి కేవలం 30 నిమిషాలు మాత్రమే అనుమతిస్తున్నారు. చాలా సార్లు ఆ 30 నిమిషాలకు కూడా నిరాకరిస్తున్నారు' అని కుమారుడితో ఇమ్రాన్ చెప్పారు. చాలా రోజులుగా జైలు జీవితం గడుపుతున్న ఇమ్రాన్ కుడి కంటి చూపు 85 శాతం తగ్గినట్టు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలె ఆయన కంటికి చికిత్స జరిగినట్టు సమాచారం.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ యుద్ధం.. రంగంలోకి సౌదీ అరేబియా, యూఏఈ..


వరుస నష్టాలకు బ్రేక్ .. భారీ లాభాల్లో దేశీయ సూచీలు..

Updated Date - Mar 24 , 2026 | 07:46 PM