Share News

ఆరామ్‌కో హెడ్‌క్వార్టర్స్‌పై హూతీల క్షిపణి దాడి

ABN , Publish Date - Oct 15 , 2026 | 07:00 AM

హూతీల దాడులతో సౌదీ అరేబియా అతలాకుతలం అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన ధహ్రాన్‌ నగరంలోని ఆరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీలు బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశారు.

ఆరామ్‌కో హెడ్‌క్వార్టర్స్‌పై హూతీల క్షిపణి దాడి
Saudi Aramco attack

రియాద్‌, అక్టోబరు 14: హూతీల దాడులతో సౌదీ అరేబియా అతలాకుతలం అవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన ధహ్రాన్‌ నగరంలోని ఆరామ్‌కో ప్రధాన కార్యాలయంపై హూతీలు బాలిస్టిక్‌ క్షిపణితో దాడి చేశారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. దీనికి తోడు రియాద్‌పై కూడా హూతీలు క్షిపణలు ప్రయోగించారు. క్షిపణి శకలాలు పడి రియాద్‌లో నలుగురు గాయపడ్డారు. ప్రతిగా సౌదీ అరేబియా హూతీల ఆధీనంలో ఉన్న యెమెన్‌ రాజధాని సనాలోని కీలక ఇంధన కేంద్రంపై దాడి చేసింది. ఘటనలో ఇద్దరు మృతి చెందారు.


ఈ వార్తలు కూడా చదవండి

న్యూయార్క్‌ కంటే హైదరాబాద్‌ తక్కువేం కాదు

తెలంగాణలో పెట్టుబడులకు పూర్తి భద్రత

డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు

Read Latest AP News And Telangana News And International

Updated Date - Oct 15 , 2026 | 07:00 AM