Share News

సౌదీ అరేబియాపై హూతీల దాడి

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:40 AM

సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. సౌదీలోని పౌర, ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలే...

సౌదీ అరేబియాపై హూతీల దాడి

రియాద్‌, సెప్టెంబరు 8: సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. సౌదీలోని పౌర, ఆర్థిక, ఇంధన మౌలిక సదుపాయాలే లక్ష్యంగా మంగళవారం తెల్లవారుజామున ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో మహిళలు చిన్నారులు సహా కనీసం 73 మంది గాయపడినట్లు సౌదీ తెలిపింది. దక్షిణ ప్రావిన్స్‌లోని అభా అంతర్జాతీయ విమానాశ్రయం, కింగ్‌ ఖాలిద్‌ ఎయిర్‌ బేస్‌లతో పాటు ప్రభుత్వ రంగ చమురు దిగ్గజం ‘ఆరామ్‌కో’కు చెందిన అభా, జిజాన్‌ ప్రాంతాల్లోని చమురు క్షేత్రాలపై హూతీలు విరుచుకుపడ్డారు.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 05:40 AM