సౌదీలోని రెండు ఎయిర్‌పోర్టులపై హుతీల దాడులు
ABN , Publish Date - Oct 07 , 2026 | 03:25 AM
హుతీలు తమ దేశంలోని రెండు ఎయిర్‌పోర్టులు జాజన్, నజ్రాన్ ఎయిర్‌పోర్టులపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారని, ఈ దాడుల వల్ల ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది
న్యూఢిల్లీ, అక్టోబరు 6: హుతీలు తమ దేశంలోని రెండు ఎయిర్‌పోర్టులు జాజన్, నజ్రాన్ ఎయిర్‌పోర్టులపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేశారని, ఈ దాడుల వల్ల ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారని సౌదీ అరేబియా మంగళవారం ప్రకటించింది. ఈ రెండు ఎయిర్‌పోర్టులు యెమెన్ సరిహద్దులకు దగ్గర్లో ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, యెమెన్‌లో హుతీలు, ప్రభుత్వ బలగాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. బాబ్-ఎల్-మాండేబ్ జలసంధిలో కీలకమైన పోర్టు సిటీ మోకాను, అలాగే అల్-తుర్బా పట్టణాన్ని హుతీల నుంచి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ప్రకటనను హుతీలు ఖండించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మోదీపై ట్రంప్‌నకు చాలా మంచి అభిప్రాయం: ఆస్ట్రేలియా మాజీ ప్రధాని
దుబాయ్ ముస్లింలపై ప్రేమ ఎందుకు? : సింగర్ మికా సింగ్