పుల్వామా సూత్రధారి అంత్యక్రియల్లో పాల్గొన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు..
ABN , Publish Date - May 23 , 2026 | 03:00 PM
శుక్రవారం హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఇస్లామాబాద్, మే 23: పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హమ్జా బుర్హాన్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. గురువారం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు బుర్హాన్‌ను తుపాకులతో కాల్చి చంపారు. శుక్రవారం హమ్జా బుర్హాన్ అంత్యక్రియలు జరిగాయి. ఈ అంత్యక్రియల్లో పాకిస్థాన్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాల్గొన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్.. అల్ బదర్ అధినేత భక్త్ జమీనా ఖాన్ ఇస్లామాబాద్‌లో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు.
అంతేకాదు.. పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకి చెందిన వారు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలు జరిగే ప్రదేశంలో ఏకే 47లతో పాటు, మరికొన్ని అధునాతన ఆయుధాలతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో టెర్రరిస్ట్ నాయకులకు భారీ భద్రత కల్పించినట్లు తెలుస్తోంది.
హమ్జా బుర్హాన్ ఎవరంటే..
జమ్ముకశ్మీర్, పుల్వామా జిల్లాలోని రత్నిపోరాకు చెందిన అర్జుమంద్ గుల్జర్ దర్ అలియాస్ బుర్హాన్ మెడిసిన్ చదివాడు. టెర్రరిజం మీద ఆసక్తితో భారత్ వదిలి పాకిస్థాన్ వెళ్లాడు. అల్ బదర్ టెర్రరిస్ట్ గ్రూపులో చేరాడు. 2019లో జరిగిన పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. గత కొన్నేళ్ల నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అండర్‌కవర్‌లో ఉన్నాడు. ముజఫరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నాడు. గురువారం ఉదయం కాలేజీ నుంచి బయటకు వచ్చిన బుర్హాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అతడు చనిపోయాడు.
ఇవి కూడా చదవండి
నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన
చరిత్ర సృష్టించిన పాటిదార్.. అత్యంత వేగవంతమైన భారత బ్యాటర్..