ఆయుధాలు వదిలేసేందుకు హమాస్ సిద్ధం
ABN , Publish Date - Aug 01 , 2026 | 05:39 AM
గాజా శాంతి ఒప్పందంలో కీలక అంశమైన ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హమాస్ నిరాయుధీకరణతోపాటు ఇజ్రాయెల్...
గాజాలో శాంతి కోసం 20 సూత్రాల
ప్రణాళికలోని కీలక అంశం అమల్లోకి
క్రమంగా ఇజ్రాయెల్ సైన్యం వెనక్కి
హమా్‌సతో ఒప్పందం కుదిరింది: ట్రంప్
ధ్రువీకరించిన హమాస్
వాషింగ్టన్/న్యూఢిల్లీ, జూలై 31: గాజా శాంతి ఒప్పందంలో కీలక అంశమైన ఆయుధాలను వదిలేసేందుకు హమాస్ సిద్ధమైందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. హమాస్ నిరాయుధీకరణతోపాటు ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణపై ఒప్పందం కుదిరిందని తెలిపారు. గాజా శాంతి మండలి భేటీ అనంతరం ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ‘‘కొత్త పాలస్తీనా ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఇది కీలక అడుగు. హమాస్ ఆయుధాల అప్పగింత జరుగుతున్న కొద్దీ ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ కొనసాగుతుంది. తర్వాత పాలస్థీనా పోలీసులతో కలిసి అంతర్జాతీయ స్థిరీకరణ దళం గాజాలో భద్రతను పర్యవేక్షిస్తుంది’’ అని ట్రంప్ వెల్లడించారు. గాజా శాంతి మండలి (బోర్డ్ ఆఫ్ పీస్) ఆధ్వర్యంలో 20 సూత్రాల పునర్నిర్మాణ ప్రణాళిక అమలవుతుందని తెలిపారు. మరోవైపు నిరాయుధీకరణపై ఒప్పందం కుదిరిందని హమాస్ సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. అయితే దీనిపై ఇజ్రాయెల్ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
విశ్రాంత ఉద్యోగులకు మరో 2 వేల కోట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News