Share News

హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు కీలక అడుగు..

ABN , Publish Date - Aug 29 , 2026 | 09:43 AM

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది.

హెచ్-1బీ వీసాదారులకు మరో షాక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు కీలక అడుగు..
H-1B 60-Day Grace Period

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. హెచ్-1బీ వీసాదారులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనపై వైట్‌హౌస్ సమీక్ష పూర్తయింది. విదేశీ ఉద్యోగులు, ఉద్యోగం కోల్పోయిన తర్వాత అమెరికాలో ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇప్పటివరకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది. ఆ గ్రేస్ పీరియడ్‌ను తొలగించేందుకు ట్రంప్ సర్కారు పావులు కదుపుతోంది (H-1B 60-Day Grace Period).


అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) ఈ ప్రతిపాదనను రూపొందించింది. ఇది ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యలేటరీ అఫైర్స్ (OIRA) సమీక్షను దాటింది. ప్రతిపాదన ఇంకా తదుపరి నియంత్రణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. ప్రస్తుతం హెచ్-1బీ సహా కొన్ని నాన్-ఇమిగ్రెంట్ వీసాలపై పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతే సాధారణంగా 60 రోజుల వరకు లేదా వారికి అనుమతించిన స్టే ముగిసే వరకు అమెరికాలో ఉండవచ్చు (Trump H-1B Rules).


ఆ గ్రేస్ పీరియడ్ ముగిసే లోపు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం, కొత్త కంపెనీ ద్వారా హెచ్-1బీ స్పాన్సర్‌షిప్ పొందడం లేదా మరో చట్టబద్ధమైన ఇమిగ్రేషన్ స్టేటస్‌కు మారే అవకాశాలను పరిశీలించవచ్చు. తాజా ప్రతిపాదన తుది నిబంధనగా మారితే.. ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న 60 రోజుల వెసులుబాటు ఉండదు. దీంతో కొత్త ఉద్యోగం, వీసా స్టేటస్ మార్పు లేదా అమెరికా నుంచి వెళ్లిపోవడం వంటి నిర్ణయాలను చాలా తక్కువ సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది (H-1B Visa Changes 2026).


ఇటీవలి కాలంలో అమెరికాలో హెచ్-1బీ ఆమోదాల్లో భారతీయుల వాటా 70 శాతానికి పైగా ఉంది. అందువల్ల హెచ్-1బీ నిబంధనల్లో మార్పులు భారతీయ టెక్ నిపుణులు, ఇంజినీర్లు, ఇతర ప్రొఫెషనల్స్‌పై గణనీయమైన ప్రభావం చూపవచ్చు.


ఇవి కూడా చదవండి..

ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..


స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

Updated Date - Aug 29 , 2026 | 09:48 AM