ఒడిశాలో దారుణం.. పాఠశాలలో విద్యార్థినికి మెడికల్ చెకప్ చేస్తుండగా..
ABN , Publish Date - Aug 29 , 2026 | 08:44 AM
ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలికకు నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఒడిశాలో దిగ్భ్రాంతికర ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. మయూర్‌భంజ్ జిల్లాలోని ఓ రెసిడెన్షియల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలికకు నిర్వహించిన సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ఆమె ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రులకు ఆ బాలిక షాకింగ్ విషయం చెప్పింది (Odisha Class 9 Student Pregnant).
పాఠశాలలో ఈ వారం నిర్వహించిన రొటీన్ మెడికల్ చెకప్‌లో బాలిక ఐదు నెలల గర్భవతి అని గుర్తించారు. వెంటనే స్కూల్ యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించింది. తల్లిదండ్రులు బాలికతో మాట్లాడిన తర్వాత ఆమె వేసవి సెలవుల్లో తనపై జరిగిన లైంగిక దాడి గురించి వెల్లడించింది. వేసవి సెలవుల్లో బాలిక ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెకు ట్యూషన్ చెప్పేందుకు వచ్చిన ప్రైవేట్ ట్యూటర్ అత్యాచారానికి పాల్పడ్డాడు (Odisha Tutor Arrested).
ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను ఆ ట్యూటర్ బెదిరించాడు (Mayurbhanj Student Case). ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, సదరు ప్రైవేట్ ట్యూటర్‌ను శుక్రవారం అరెస్ట్ చేశారు. కేసుపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాలికపై జరిగిన ఘటనకు సంబంధించి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఆయిల్ డీల్.. వెనెజువెలాతో ఒప్పందంపై ట్రంప్ ప్రకటన..
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..