Share News

టిక్‌టాక్ ఫాలోవర్స్ కోసం చెల్లిని కత్తితో పొడిచి చంపిన అక్క..

ABN , Publish Date - Sep 04 , 2026 | 08:06 AM

పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. టిక్‌టాక్ ఫాలోవర్స్ కోసం ఓ యువతి తన చెల్లెలిని కత్తితో పొడిచి చంపింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టిక్‌టాక్ ఫాలోవర్స్ కోసం చెల్లిని కత్తితో పొడిచి చంపిన అక్క..
TikTok followers

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. టిక్‌టాక్ ఫాలోవర్స్ కోసం ఓ యువతి తన చెల్లెలిని కత్తితో పొడిచి చంపింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజ్రాన్‌వాలా సిటీకి చెందిన అబ్దుల్ షకూర్ అనే వ్యక్తికి ఆరుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. మంగళవారం అతడి ఇంటికి కొంతమంది బంధువులు వచ్చారు. అబ్దుల్ గ్రౌండ్ ఫ్లోర్‌లో బంధువులతో బిజీగా ఉన్న సమయంలో పై ఫ్లోర్‌నుంచి కూతురి ఏడుపు వినిపించింది.


వెంటనే అతడు పైకి వెళ్లాడు. అక్కడ కూతురు మనహిల్ రక్తపు మడుగులో పడి ఉంది. పక్కనే మనహిల్ అక్క కత్తితో నిల్చుని ఉంది. అబ్దుల్ హుటాహుటిన మనహిల్‌ను ఆస్పత్రికి తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈ సంఘటనపై అబ్దుల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇద్దరు కూతుళ్లు డబ్బుల విషయంలో గొడవపడుతుండే వారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.


హత్యకు పాల్పడిన కూతురిని పోలీసులకు అప్పగించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన జరిగిన ఏరియాలోని ప్రజలను విచారించగా.. అక్కాచెల్లెలు టిక్‌టాక్‌లో యాక్టీవ్‌గా ఉండేవారని, ఫాలోవర్స్ విషయంలో తరచుగా గొడవపడుతుంటే వారని చెప్పారు. పోలీసులు నిందితురాలిని విచారించగా.. ఫాలోవర్స్ విషయంలో గొడవ కారణంగానే చెల్లెలిని చంపేసినట్లు ఒప్పుకుంది.


ఇవి కూడా చదవండి

ఇరాన్‌లో పెళ్లింటిపై దాడి ఘటన.. దర్యాప్తు చేస్తున్నాం: జేడీ వాన్స్

నవంబర్‌ 4 నుంచి 8 ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల వేళల్లో మార్పులు

Updated Date - Sep 04 , 2026 | 08:14 AM