Share News

లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున తొలిసారి గంగా హారతి

ABN , Publish Date - Sep 16 , 2026 | 06:20 AM

బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున ఆదివారం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు...

లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున తొలిసారి గంగా హారతి

లండన్‌, సెప్టెంబరు 15 : బ్రిటన్‌ రాజధాని లండన్‌లో థేమ్స్‌ నది ఒడ్డున ఆదివారం నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి వేలాది మంది హాజరయ్యారు. చిన్మయ మిషన్‌ సేవలు ప్రారంభించి 75ఏళ్లు అయిన సందర్భంగా.. చిన్మయ్‌ మిషన్‌ యూకే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. గంగా నది ఒడ్డున ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే హారతి తరహాలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా చిన్మయ మిషన్‌ యూకే గ్లోబల్‌ హెడ్‌ స్వామి స్వరూపానంద మాట్లాడుతూ.. గంగమ్మ తల్లి స్ఫూర్తి, సంప్రదాయాలు, సంస్కృతి, జ్ఞానం, దైవత్వం గుర్తుచేసుకొనేందుకే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. గ్రీన్‌విచ్‌లో థేమ్స్‌ నది ఒడ్డున గంగా హారతి కార్యక్రమానికి నాయకత్వం వహించిన ఆయన చిన్మయ మిషన్‌ యూకేలో చేపట్టిన విద్య, గ్రామీణాభివృద్ధి సేవా కార్యక్రమాలను వివరించారు. కాగా ఈ కార్యక్రమం పూర్తిగా థేమ్స్‌ నది ఒడ్డునే నిర్వహించారు. దీపాలను కూడా నదిలోకి జార విడువకుండా ఒడ్డునే ఉంచారు.

ఇవి కూడా చదవండి...

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల

చంపేస్తానంటూ బెదిరింపులు.. నెల్లూరులో రెచ్చిపోయిన వైసీపీ రౌడీ మూకలు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 06:20 AM