ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైన ఖమేనీ కుమారుడు మొజ్తాబా..
ABN , Publish Date - Mar 04 , 2026 | 08:07 AM
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన భార్య, కూతురు, అల్లుడు, మనవడు కూడా చనిపోయారు.
టెహ్రాన్, మార్చి 4: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా హుస్సేన్ ఖమేనీ కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నికైనట్లు సమాచారం. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ మొజ్తాబాను కొత్త సుప్రీం లీడర్‌గా ఎన్నిక చేసినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, మొజ్తాబా ఎన్నిక గురించి ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. సుప్రీం లీడర్ రేసులో మొజ్తాబాతో పాటు ఇబ్రహీం రైసి, సాధిక్ లర్జానీలు ఉన్నప్పటికి రెవల్యూషనరీ గార్డ్స్ మాత్రం మొజ్తాబా వైపు మొగ్గు చూపారు.
ఖమేనీ మరణంతో..
దివంగత ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 36 ఏళ్ల పాటు పదవిలో ఉన్నారు. ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్ నాయకులే లక్ష్యంగా టెహ్రాన్‌లోని 30 ప్రాంతాల్లో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు శనివారం భీకర బాంబు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీతో పాటు ఆయన కూతురు, అల్లుడు, మనవడు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ ఖమేనీ భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఖమేనీ స్థానంలో తాత్కాలిక సుప్రీం లీడర్‌గా ఆయతుల్లా అలీరెజా అరాఫీ నియమితులయ్యారు.
ఇప్పుడు కొత్త సుప్రీం లీడర్ ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. ఇక, ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు త్వరలో జరగనున్నాయి. పవిత్ర నగరం మషాద్‌లో ఖమేనీ పార్థివ దేహాన్ని ఖననం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్‌లో భారీ వీడ్కోలు వేడుక జరగనుంది. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు టెలిగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టింది. అయితే, అంత్యక్రియల తేదీ మాత్రం ప్రకటించలేదు.
ఇవి కూడా చదవండి
దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి..
టీ20 డబ్ల్యూసీ: ఆ ఇద్దరితో సంజుకు ముప్పు తప్పదా?