Share News

జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి

ABN , Publish Date - Jun 29 , 2026 | 06:43 PM

జర్మనీలో తాజాగా కాల్పుల కలకలం రేగింది. స్డేడ్ నగరంలోని ఒక యూత్ కేంద్రంలో కాల్పులు జరగడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి
Germany Shooting

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీలో కాల్పుల కలకలం రేగింది. ఉత్తర జర్మనీలోని ఒక యూత్ కేంద్రంలో సోమవారం కాల్పులు జరగడంతో ఐదుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అయితే, పోలీసులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. పోలీసుల అదుపులోని ఇద్దరిలో ఒకరు ఈ కాల్పులకు తెగబడినట్టు తెలుస్తోంది. కాల్పులకు ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.


జర్మనీ సహా పశ్చిమ ఐరోపా దేశాలన్నిటిలో ఆయుధాల చట్టాలు కఠినంగా ఉంటాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తుంటాయి. స్టేడ్ నగరం జనాభా సుమారు 50 వేలు. హ్యామ్‌బర్గ‌కు పశ్చిమాన 25 మైళ్ల దూరంలో స్టేడ్ నగరం ఉంది.


ఈ వార్తలనూ చదవండి:

రియల్ లైఫ్ 'బ్యాట్‌మ్యాన్'.. దొంగలను వేటాడి, స్తంభాలకు కట్టేస్తున్న ముసుగు వీరుడు!

హోర్ముజ్ జలసంధి వివాదం.. ఆర్టికల్-5 ఏం చెబుతోంది?

Updated Date - Jun 29 , 2026 | 07:00 PM