Share News

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు? రష్యా ప్లాన్స్‌పై జర్మనీ ఆందోళన

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:09 PM

రష్యా తన అణ్వాయుధాలను అంతరిక్షంలో మోహరించనుందా? అంటే ఇందుకు అవకాశాలు ఉన్నాయని జర్మనీ ఆందోళన చెందుతోంది.

అంతరిక్షంలో అణ్వాయుధాల మోహరింపు? రష్యా ప్లాన్స్‌పై జర్మనీ ఆందోళన
Russia nuclear weapons in Space

ఇంటర్నెట్ డెస్క్: రష్యా తన అణ్వాయుధాలను అంతరిక్షంలో మోహరించనుందా? అంటే ఇందుకు అవకాశాలు ఉన్నాయని జర్మనీ ఆందోళన చెందుతోంది. ఈ ఏడాది చివరి కల్లా అణ్వాయుధాలను శాటిలైట్‌ల ద్వారా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న వార్తలపై జర్మనీ ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


జర్మనీకి చెందిన కొన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, మిలిటరీ అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఫలితంగా రష్యా ప్లాన్స్‌ గురించి ఆందోళనలు మొదలయ్యాయి. ఈ ఏడాది చివరి కల్లా రష్యా తన ప్లాన్స్‌కు కార్యరూపం ఇవ్వొచ్చని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. కొన్ని నాటో సభ్య దేశాలతో సంబంధిత వర్గాలు ఈ వివరాలను ఇప్పటికే పంచుకున్నట్టు కూడా తెలిసింది. రష్యా ప్లాన్స్‌పై జర్మనీ మిలిటరీ వర్గాల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. జర్మనీ నేతలకు అక్కడి మిలిటరీ అధికారులు ఇప్పటికే తమ భయాందోళనల గురించి వివరించారు.


ఈ వార్తలపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రీడ్రిక్ మెర్జ్ సోమవారం ఓ పత్రికా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రట్ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ‘ఈ వార్తలు కొత్తేమీ కాకపోయినా ఇది చాలా ఆందోళనకరమైన అంశం. పరిస్థితి ఎక్కడికైనా తీసుకెళ్లేందుకు రష్యా సిద్ధంగా ఉందన్న విషయం ఈ వార్తలతో స్పష్టమవుతోంది’ అని జర్మనీ ఛాన్సలర్ అన్నారు. నాటో దేశాల్లో ప్రతి అంగుళం భూభాగాన్ని కాపాడుకుంటామని సెక్రటరీ జనరల్ మార్క్ రట్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం తాము పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని జర్మనీ రక్షణ శాఖ పేర్కొంది.


ఈ వార్తలనూ చదవండి:

షేక్ హసీనా సొంత ఊరిలో ఘర్షణలు.. నాటుబాంబులతో దాడులు

సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు.. మీమ్‌తో జెన్సన్‌కు ఘన స్వాగతం

Updated Date - Nov 24 , 2026 | 03:12 PM