షేక్ హసీనా సొంత ఊరిలో ఘర్షణలు.. నాటుబాంబులతో దాడులు
ABN , Publish Date - Nov 24 , 2026 | 11:39 AM
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత ఊరు గోపాల్‌గంజ్‌లో సోమవారం ఘర్షణలు చెలరేగాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సొంత ఊరు గోపాల్‌గంజ్‌లో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. హసీనా సారథ్యంలోని పార్టీ ఆవామీ లీగ్, పార్టీకి చెందిన సంస్థలు నిర్వహించిన ర్యాలీలో ఘర్షణలు చెలరేగాయి. ఈ క్రమంలో నాటు బాంబులతో కూడా దాడులు జరగడంతో 30 మంది గాయపడ్డారు. త్వరలో షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లనున్న విషయం తెలిసిందే.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఆవామీ లీగ్ కార్యకర్తలు, మద్దతుదారులతో స్థానిక యువత కొందరు ఘర్షణకు దిగారు. చూస్తుండగా ఇది తీవ్ర రూపం దాల్చింది. దీంతో, ఇరు వర్గాలు పరస్పరదాడులకు దిగాయి. ఈ సందర్భంగా నాలుబాంబులను వేసినట్టు కూడా తెలిసింది. సమీపంలోని 7 షాపులను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు.
ఇదిలా ఉంటే, స్థానికంగా ఉన్న మరో గ్రామంలో కూడా ఇలాగే ఘర్షణలు చెలరేగడంతో మరో 10 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో నిరసనకారులు మరో 5 షాపులను ధ్వంసం చేశారు. నవంబర్ 29, 30 తేదీల్లో ఆవామీ లీగ్ దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో హసీనా సొంత ఊరిలో ఘర్షణలు చోటుచేసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక డిసెంబర్ 16న తాను బంగ్లాదేశ్ వెళ్లనున్నట్టు మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన డిసెంబర్ 16న ఆమె సొంతదేశంలో కాలుపెట్టేందుకు నిర్ణయించారు.
ఈ వార్తలనూ చదవండి:
సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు.. మీమ్‌తో జెన్సన్‌కు ఘన స్వాగతం
హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం