Share News

సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు.. మీమ్‌తో జెన్సన్‌కు ఘన స్వాగతం

ABN , Publish Date - Nov 24 , 2026 | 08:15 AM

ప్రముఖ చిప్ మేకర్ ఎన్విడియాకు సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్ నియామకంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తాజా ట్రెండ్‌కు తగ్గట్టుగా జెన్సన్‌కు ఓ మీమ్‌తో స్వాగతం పలికారు.

సోషల్ మీడియాలో ట్రంప్ పోస్టు.. మీమ్‌తో జెన్సన్‌కు ఘన స్వాగతం
Donald Trump Jensen Huang Meme

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ చిప్ మేకర్ ఎన్విడియాకు సీఈఓగా జెన్సన్ హువాంగ్ పునర్ నియామకంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తాజా ట్రెండ్‌కు తగ్గట్టుగా జెన్సన్‌కు ఓ మీమ్‌తో స్వాగతం పలికారు. చైనా గూఢచారిణిగా అనుమానాలున్న మహిళతో ఎఫైర్ బయటపడ్డాక జెన్సన్ సీఈఓ పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జెన్సన్‌ను మళ్లీ సీఈఓగా ఎంపిక చేసినందుకు ఎన్విడియాను కూడా ట్రంప్ అభినందించారు.


2024 అధ్యక్ష ఎన్నికలకు మునుపు తనపై హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో తీసిన ఫొటో ఆధారంగా ట్రంప్ ఈ మీమ్‌ను షేర్ చేశారు. జెన్సన్ ఓ యోధుడనే అర్థం వచ్చేలా ట్రంప్ ఈ మీమ్ ఎంచుకున్నారు. ఎఫైర్‌తో రేగిన కాంట్రవర్సీని గుర్తుకు తెచ్చేలా చేతిలో ఎర్రటి బ్రా, ముఖంపై రక్తం, బ్యాక్‌గ్రౌండ్‌లో ఎన్విడియా జెండాతో జెన్సన్ విజయోత్సాహంతో ఉన్నట్టు ట్రంప్ ఈ మీమ్‌ను షేర్ చేశారు. జెన్సన్‌ను ట్రంప్ ఎంతలా గౌరవిస్తారో చెప్పేలా ఈ మీమ్ ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎఫైర్ పేరిట జెన్సన్‌కు చెక్ పెట్టాలనుకున్న వారిని ఆయన చిత్తు చేశారని ట్రంప్ చెప్పే ప్రయత్నం చేశారు.


రాజకీయాల్లో తన రీఎంట్రీ, కార్పొరేట్ రంగంలో జెన్సన్ రీఎంట్రీ దాదాపు ఒకటేనని ట్రంప్ చెప్పే ప్రయత్నం చేశారు. దాడి తరువాత ట్రంప్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అమెరికా పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక ఎఫైర్ కారణంగా జెన్సన్ జాబ్ కోల్పోయినప్పటికీ ఆ తరువాత మళ్లీ అందరి మద్దతు కూడగట్టుకుని సీఈఓగా ఎన్విడియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఎన్విడియా సంస్థ బోర్డు సోమవారం జెన్సన్‌ను సీఈఓగా పునర్ నియమించింది.


ఈ వార్తలనూ చదవండి:

హష్‌మనీ కేసును రద్దు చేయించుకునేందుకు ట్రంప్‌కు మరో అవకాశం

చైనా నుంచి బంగ్లాదేశ్‌కు అక్రమంగా.. 100 క్షిపణులకు సరిపడా కెమికల్‌

Updated Date - Nov 24 , 2026 | 08:34 AM