ఐరోపాలో వడగాలులు.. పలు ప్రాంతాల్లో కార్చిచ్చు
ABN , Publish Date - Jun 29 , 2026 | 10:24 PM
ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో వడగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఐరోపా ఖండం అల్లాడుతోంది. జూన్ 21 నుంచి ఇప్పటివరకూ భానుడి ప్రతాపానికి 1300 మందికి పైగా కన్నుమూశారు. ఆదివారం అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటాయి. ఫ్రాన్స్‌లో అంచనాలకు మించి వెయ్యి అదనపు మరణాలు సంభవించగా, జర్మనీలో కార్చిచ్చు చెలరేగింది. రోడ్లు, రైలు నెట్వర్క్‌లు దెబ్బతిన్నాయి. ఎమర్జెన్సీ సర్వీసులకు ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. గ్రీస్‌లో కూడా కార్చిచ్చు ముప్పు ఉండటంతో అధికారులు హైలర్ట్‌లో ఉన్నారు. మరోవైపు, కొన్ని రోజుల క్రితం అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన స్వీడెన్‌లో అకస్మాత్తుగా భారీ వర్షం కురవడంతో పలువురు పిడుగుపాటుకు గురై మరణించారు. డెన్మార్క్‌లోనూ కుండపోత వర్షం కురిసింది.
ఐరోపాలో ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు. ఫలితంగా అక్కడ వడగాలులు అంతకంతకూ తీవ్రం అవుతున్నాయని హెచ్చరించారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరుగుతున్న ఖండంగా ఐరోపా నిలిచిందని హెచ్చరించారు. 150 మిలియన్‌ల మంది అధిక ఉష్ణోగ్రతల ముప్పు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒకప్పుడు వడగాలులు ఐరోపా ఖండంలో అరుదుగా సంభవించేవని అన్నారు. కానీ నేడు సాధారణ విషయంగా మారిపోయాయని చెప్పారు. భూతాపం పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ఈ విపత్తులు సంభవిస్తున్నాయని అన్నారు. అధిక వేడిని సైలెంట్ కిల్లర్‌గా అభివర్ణించారు. వాతావరణ మార్పులతో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ప్రభుత్వాలు హీట్ హెల్త్ యాక్షన్ ప్లాన్స్‌ను సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
రేపు ఇరాన్‌తో దోహాలో చర్చలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
జర్మనీలో కాల్పుల కలకలం.. ఐదుగురి మృతి