Share News

మీరు విక్రయించే ఆయుధాలతోనే భారత్‌పై దాడులు.. ఐరోపా దేశలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:24 PM

ఇంధన కొనుగోళ్ల కోసం రష్యాను భారత్ ఎంచుకోవడాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ సమర్ధించారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తమను ప్రశ్నిస్తున్న దేశాలే భారత ప్రత్యర్థులకు ఆయుధాలు అమ్ముతున్నాయని, ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయని అన్నారు.

మీరు విక్రయించే ఆయుధాలతోనే భారత్‌పై దాడులు.. ఐరోపా దేశలకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్
Jaishankar

ఫిన్లాండ్: ఇంధన కొనుగోళ్ల కోసం రష్యాను భారత్ ఎంచుకోవడాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (S Jaishankar) సమర్ధించారు. రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిపై ఐరోపా దేశాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు. తమను ప్రశ్నిస్తున్న దేశాలే భారత ప్రత్యర్థులకు ఆయుధాలు అమ్ముతున్నాయని, ఆ ఆయుధాలతోనే భారత్‌పై దాడులు జరుగుతున్నాయని అన్నారు. తమను ప్రశ్నిస్తున్న దేశాలు ద్వంద్వ వైఖరి విడనాలని అన్నారు. ఫిన్లాండ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఇంధనం కొనుగోలకు రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఆ దేశ చమురుపై భారత్ ఆధారపడుతోందన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమిచ్చారు. జాతీయ ప్రయోజనాలు, ఇంధన భద్రత, ఆర్థిక అంశాల ఆధారంగా భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉంటాయని అన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, ఆ తర్వాత మాస్కోపై ఆంక్షలతో గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లకు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. 'ధర, లభ్యత అనే రెండు పాయింట్ల ఆధారంగా చమురు కొనుగోలు నిర్ణయం తీసుకున్నాం. ఆ సమయంలో మార్కెట్‌లో లభించే చమురులో అధిక భాగం రష్యాకు చెందినదే. పశ్చిమాసియా నుంచి అప్పుడు యూరప్ ఐరోపా చమురు కొనుగోలు చేసింది. ఈ పరిణామాల ఆధారంగానే మేము నిర్ణయం తీసుకున్నాం' అని జైశంకర్ తెలిపారు. ఆ సమంలో ప్రపంచ మార్కెట్ల స్థిరీకరణ కోసం రష్యా చమురు కొనుగోలు చేయవచ్చని భారత్‌కు అమెరికా చాలా స్పష్టంగా చెప్పిందని, మొదట్లో రష్యా ఆయిల్ కొన్నందుకు తమపై సుంకాలు వేశారని, ఆ తర్వాత మళ్లీ ఆ ఆంక్షలు ఎత్తేశారని గుర్తుచేశారు. దీనిని ఒక సిద్ధాంతమని కానీ, నైతిక పవిత్రతగా కానీ చూడలేమని అన్నారు. చమురు దిగుమతుల అంశం పొలిటికల్ మెసేజింగ్‌ ద్వారా కాకుండా ఆచరణాత్మక పరిశీలన ద్వారానే నిర్ధారించుకోవాల్సి ఉంటుదని స్పష్టం చేశారు.


భారతదేశ ప్రత్యర్థులకు ఐరోపా దేశాలు ఆయుధాలు అమ్మిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా జైశంకర్ ప్రస్తావించారు. భారత్ తయారు చేసిన ఆయుధాలతో ఏ ఐరోపా దేశంపైనా దాడి జరగలేదని, ఐరోపా ఆయుధాల విషయంలోనూ తాను అలా చెప్పగలిగి ఉండే బాగుండేదని అన్నారు. ఐరోపా అమ్మిన ఆయుధాలను భారత్‌పై దాడికి ఉపయోగించారని, ఇది చాలాకాలంగా జరుగుతోందని అన్నారు. ఐరోపాకు హాని కలిగించే పనులు భారతీయులు ఎప్పుడూ చేయలేదని స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

రాజ్యసభకు ఖర్గే సహా 24 మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నిక

మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం

Updated Date - Jun 12 , 2026 | 04:28 PM