Share News

ఎల్‌నినోతో సముద్రాలు సలసల

ABN , Publish Date - Aug 26 , 2026 | 07:02 AM

ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేనంతస్థాయిలో వేడెక్కిపోతున్నాయి. యూరోపియన్‌ కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌...

ఎల్‌నినోతో సముద్రాలు సలసల

లండన్‌, ఆగస్టు 25: ప్రపంచవ్యాప్తంగా సముద్రాలు మునుపెన్నడూ లేనంతస్థాయిలో వేడెక్కిపోతున్నాయి. యూరోపియన్‌ కోపర్నికస్‌ క్లైమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ వివరాల ప్రకారం.. 2024 మార్చిలో ధ్రువ ప్రాంతాలు మినహా ప్రపంచవ్యాప్తంగా మిగతాచోట్ల సముద్రాల ఉపరితల సగటు ఉష్ణోగ్రతలు 21.09 డిగ్రీలుగా నమోదు కాగా.. ఈ ఏడాది జూలైలో ఆ రికార్డు బద్దలైంది. సముద్రాల సగటు ఉపరితల ఉష్ణోగ్రతలు 21.1 డిగ్రీలకు చేరుకున్నాయి. తేడా కొద్దిగానే అనిపిస్తున్నప్పటికీ.. ఈ ఉష్ణోగ్రతలు నమోదైన సమయమే ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే.. సాధారణంగా దక్షిణార్థ గోళంలో మార్చి లేదా ఏప్రిల్‌ నెలల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గరిష్ఠస్థాయికి చేరుకుంటాయి. కానీ.. ఈ సారి జూలైనెలలోనే గరిష్ఠస్థాయులకు చేరుకోవడం గమనార్హం. మానవ తప్పిదాల వల్ల ఏర్పడి, వాతావరణ మార్పుల కారణంగా బలపడుతున్న ‘ఎల్‌నినో’యే సముద్రాల సలసలకు కారణమని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్.. బ్రిక్స్ సదస్సుకు 400 మందితో భారీ బృందం..

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి సంబంధించిన అరుదైన వీడియో విడుదల!

Updated Date - Aug 26 , 2026 | 07:02 AM