Share News

మేం వస్తున్నాం..

ABN , Publish Date - Sep 09 , 2026 | 05:17 AM

బోచాసన్‌వాసీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌(బాప్స్‌) భక్త బృందం ఈఫిల్‌ టవర్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. బాప్స్‌ బృందం పర్యటన సందర్భంగా వివక్ష...

మేం వస్తున్నాం..

  • మహిళా సిబ్బందిని పంపేయండి

  • ఈఫిల్‌ టవర్‌ నిర్వాహకులకు స్వామినారాయణ్‌ బృందం వినతి

  • మహిళా సిబ్బందిని పంపి పురుషులను ఉంచిన నిర్వాహకులు

  • వివక్ష చూపారంటూ మహిళా సిబ్బంది సమ్మె.. ఈఫిల్‌ టవర్‌ మూత

  • క్షమాపణ తెలిపిన బాప్స్‌ ప్రతినిధులు

  • దర్యాప్తుకు ఆదేశించిన పారిస్‌ మేయర్‌

పారిస్‌, సెప్టెంబరు 8: బోచాసన్‌వాసీ అక్షర్‌ పురుషోత్తం స్వామినారాయణ్‌(బాప్స్‌) భక్త బృందం ఈఫిల్‌ టవర్‌ పర్యటన వివాదాస్పదంగా మారింది. బాప్స్‌ బృందం పర్యటన సందర్భంగా వివక్ష ప్రదర్శించారంటూ సిబ్బంది సమ్మెకు దిగడంతో పారి్‌సలోని ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ తాత్కాలికంగా మూతపడింది. ఫ్రాన్స్‌లో నిర్మించిన తొలి హిందూ ప్రధాన ఆలయ ప్రతిష్ఠకు విచ్చేసిన సుమారు 100 మంది బాప్స్‌ ప్రతినిధులు ఆదివారం ఉదయం ఈఫిల్‌ టవర్‌ను సందర్శించారు. ఆ సమయంలో మహిళా సిబ్బంది వారికి తారసపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఈ వివాదానికి కారణమైంది. సిబ్బంది సమ్మెతో సోమవారం ఈఫిల్‌ టవర్‌ సందర్శనకు ఎవరినీ అనుమతించలేదు. అయితే, మంగళవారం యథావిధిగా సందర్శనలు కొనసాగాయి. కాగా, పర్యటనలో తమకు మహిళలు తారసపడకుండా చూడాలని బాప్స్‌ ప్రతినిధుల బృందం చేసిన అభ్యర్థన మేరకే అలా చేశామని ఈఫిల్‌ టవర్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సెటె కంపెనీ అధ్యక్షుడు అరీల్‌ వీల్‌ చెప్పారు. ఘటనను ఫ్రాన్స్‌లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై దర్యాప్తు జరిపిస్తామని పారిస్‌ మేయర్‌ ఇమ్మాన్యుయేల్‌ గ్రిగోరే ‘ఎక్స్‌’లో ప్రకటించారు. ఘటనపై బాప్స్‌ ప్రతినిధి బృందం మంగళవారం క్షమాపణ తెలిపింది. ‘ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతిన్నా, ఏ ఒక్కరికి అసౌకర్యం కలిగినా మనస్ఫూర్తిగా క్షమాపణ తెలుపుతున్నాం. పరస్పర గౌరవం, ఇతరులకు సేవ అనే విశ్వజనీన విలువలకు మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొంది.

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడి రాజీనామా

రాగద్వేషాలకు అతీతంగా క్షేత్రస్థాయిలోని నాయకులు పనిచేయాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 09 , 2026 | 05:17 AM