20 నిమిషాల్లో ఏడు భారీ పేలుళ్లు!
ABN , Publish Date - Aug 06 , 2026 | 05:03 AM
గల్ఫ్‌లో కీలక వ్యాపార కేంద్రమైన దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం దుబాయ్‌లోని జబేల్ అలీ పారిశ్రామిక ప్రాంతం, పోర్టులోని...
దాడులతో దద్దరిల్లిన దుబాయ్
జబేల్ అలీ పోర్టు, పారిశ్రామిక ప్రాంతంలో
భారీగా మంటలు, దట్టమైన పొగలు
యెమెన్ హుతీలే దాడి చేశారనే వార్తలు
దుబాయ్, ఆగస్టు 5: గల్ఫ్‌లో కీలక వ్యాపార కేంద్రమైన దుబాయ్ పేలుళ్లతో దద్దరిల్లింది. బుధవారం దుబాయ్‌లోని జబేల్ అలీ పారిశ్రామిక ప్రాంతం, పోర్టులోని కీలక మౌలిక సదుపాయాలు, ఇంధన నిల్వ కేంద్రాల వద్ద కేవలం 20 నిమిషాల్లోనే ఏడు భారీ పేలుళ్లు సంభవించాయి. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను అలుముకున్నాయి. యెమెన్ వైపు నుంచి దూసుకొచ్చిన క్షిపణులతోనే ఈ పేలుళ్లు సంభవించాయని ఇరాన్‌కు చెందిన మెహెర్ వార్తా సంస్థ పేర్కొంది. దీనితో యెమెన్‌లో ఇరాన్ మద్దతున్న హుతీ తీవ్రవాదులే ఈ దాడికి పాల్పడి ఉంటారనే వార్తలు వెలువడ్డాయి. పేలుళ్లను యూఏఈ అధికారులు ధ్రువీకరించినా.. ఆస్తి, ప్రాణనష్టం, ఎవరు కారణమనే అంశాలపై నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు దాడికి తామే కారణమని హుతీలు కూడా ప్రకటించలేదు.
ఇవీ చదవండి:
ఎన్‌డీఏ సమావేశానికి ముగ్గురు రెబల్ ఎంపీల గైర్హాజరు.. సువేందు విందుకు హాజరు
'మూడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి'.. మెటాకు పార్లమెంట్ అల్టిమేటం