Share News

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి ఫొటో రిలీజ్ చేసిన ట్రంప్..

ABN , Publish Date - Apr 26 , 2026 | 09:04 AM

యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పులకు తెగబడ్డ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పవర్‌ఫుల్ గన్‌తో షూటర్ కాల్పులు జరిపాడని వెల్లడించారు.

ప్రెస్ డిన్నర్‌లో కాల్పులు.. నిందితుడి ఫొటో రిలీజ్ చేసిన ట్రంప్..
Donald Trump news

న్యూయార్క్, ఏప్రిల్ 26: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాల్పులకు తెగబడ్డ షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పవర్‌ఫుల్ గన్‌తో షూటర్ కాల్పులు జరిపాడని వెల్లడించారు. ఘటనలో ఓ అధికారికి గాయాలయ్యాయని చెప్పారు. నిందితుడి దగ్గర చాలా ఆయుధాలున్నట్టు గుర్తించామన్నారు. నిందితుడిని కాలిఫోర్నియాకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు.


కాల్పులను అమెరికా రాజ్యాంగంపై దాడిగా భావిస్తున్నామన్నారు. భద్రతా సిబ్బంది అత్యంత వేగంగా స్పందించారని.. సీఐఏ ఏజెంట్స్, పోలీసులు అద్భుతంగా పనిచేశారని కొనియాడారు. ఏజెంట్లు చాలా వేగంగా, ధైర్యంగా పని చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా సీక్రెట్ సర్వీసెస్ సిబ్బందికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. గాయపడ్డ అధికారిని ఫోన్ ద్వారా పరామర్శించానని చెప్పారు. మీడియా ప్రతినిధుల సమావేశానికి ముందు నిందితుడికి సంబంధించిన ఫొటోను ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘ది ట్రూత్’లో షేర్ చేశారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
donald.jpg


ఇంతకీ ఏం జరిగిందంటే..

వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ శనివారం యాన్యువల్ ప్రెస్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలనియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు అమెరికా కీలక నేతలు పాల్గొన్నారు. హిల్టన్ హోటల్‌లోని బాల్‌రూమ్‌లో కార్యక్రమం జరిగింది. అక్కడ మొత్తం 2600 మంది ఉన్నారు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటి తర్వాత బాల్‌రూమ్ బయట కాల్పుల కలకలం చెలరేగింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. ట్రంప్‌ దంపతులతో పాటు ఇతర నాయకులను అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు.


ఇవి కూడా చదవండి

లుంగి ఎంగిడి గాయం తీవ్రమైనది కాదు.. క్షేమంగానే ఉన్నాడు: వేణుగోపాల్ రావు

మొబైల్ చూస్తోందని మందలించిన తండ్రి.. మనస్తాపానికి గురై బాలిక ఆత్మహత్యాయత్నం

Updated Date - Apr 26 , 2026 | 09:12 AM