ప్రెస్ డిన్నర్ సందర్భంగా కాల్పుల కలకలం.. వేదికను వీడిన ట్రంప్ దంపతులు..
ABN , Publish Date - Apr 26 , 2026 | 07:46 AM
వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల కలకలం నేపథ్యంలో యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌కు అంతరాయం ఏర్పడింది.
న్యూయార్క్, ఏప్రిల్ 25: వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కాల్పుల కలకలం నేపథ్యంలో యాన్యువల్ ప్రెస్ డిన్నర్‌కు అంతరాయం ఏర్పడింది. ఏఎఫ్‌పీ కథనం ప్రకారం.. శనివారం వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ యాన్యువల్ ప్రెస్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ట్రంప్‌తో పాటు 2,600 మంది పాల్గొన్నారు. కార్యక్రమం మొదలైన కొద్దిసేపటి తర్వాత ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
బాల్‌రూమ్ బయట తుపాకీ పేలుతున్న చప్పుళ్లు వినిపించటం మొదలైంది. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం అయ్యారు. కాల్పులు జరిగిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ బాల్‌రూమ్‌లోని ప్రధాన వేదికపై తన భార్య మెలనియా ట్రంప్‌తో కూర్చుని ఉన్నారు. శబ్దాలు విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వేదికపైకి దూసుకెళ్లి, వారిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. ట్రంప్ దంపతులతో పాటు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, కీలక నాయకులను అక్కడినుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. భయాందోళనకు గురైన బాల్‌రూమ్‌లోని మీడియా ప్రతినిధులు, అతిథులు టేబుళ్ల కింద దాక్కున్నారు.
ఈ ఘటనలో డిన్నర్‌లో పాల్గొన్న ఎవ్వరికీ ఏమీ కాలేదని సమాచారం. కాల్పులకు తెగబడ్డ వ్యక్తిని భద్రతా దళాలు, పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ వ్యక్తి 5 నుంచి 9 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో ఆగిపోయిన డిన్నర్.. షూటర్ పట్టుబడ్డ తర్వాత తిరిగి ప్రారంభం అయ్యింది.
ఇవి కూడా చదవండి
ఒక్క కోడిగుడ్డు ధర 2 లక్షల రియాల్స్.. ఇరాన్‌లో ధరల మోత..
కుకీ, నాగా తెగల మధ్య ఘర్షణలు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత!