Share News

పెళ్లి పార్టీలో అగ్ని ప్రమాదం.. 22 మంది దుర్మరణం..

ABN , Publish Date - Sep 06 , 2026 | 08:13 AM

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి పార్టీ సందర్భంగా ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగటంతో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు.

పెళ్లి పార్టీలో అగ్ని ప్రమాదం.. 22 మంది దుర్మరణం..
Congo wedding fire

ఇంటర్‌నెట్ డెస్క్: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగోలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి పార్టీ సందర్భంగా ఓ బిల్డింగ్‌లో మంటలు చెలరేగటంతో దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో రాజధాని కిన్‌షాషాలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి ఉత్తర కిన్‌షాషా‌, లింగ్వాలోని ఓ బిల్డింగ్‌లో పెళ్లి పార్టీ జరిగింది. అర్ధరాత్రి ఉన్నట్టుండి ఆ బిల్డింగ్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో చిక్కి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.


సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్‌లో మంటలు శనివా తెల్లవారుజాము వరకు కొనసాగాయి. లింగ్వాలా మేయర్ నార్బర్ట్ ముషింగ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరగడానికి కారణం ఏంటో తెలియరాలేదు’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

లవ్‌ అనేది ఓ ఛాయిస్‌!

ఆసియా కప్.. పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్

Updated Date - Sep 06 , 2026 | 09:28 AM