Share News

కంపించిన కొలంబియా

ABN , Publish Date - Aug 11 , 2026 | 05:07 AM

దక్షిణ అమెరికా దేశం కొలంబియా తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికింది. సోమవారం ఉదయం (స్థానిక కాలమానం) 7.34 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిపోయింది....

కంపించిన కొలంబియా

111 మంది మృతి

  • వందల మందికి గాయాలు

  • రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.4

  • కుప్పకూలిన భవనాలు

  • ప్రాణ భయంతో పరుగులు తీసిన జనం

  • మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

బొగోటా, ఆగస్టు 10: దక్షిణ అమెరికా దేశం కొలంబియా తీవ్ర భూకంపంతో చిగురుటాకులా వణికింది. సోమవారం ఉదయం (స్థానిక కాలమానం) 7.34 గంటల సమయంలో భూమి ఒక్కసారిగా కంపించిపోయింది. రిక్టర్‌ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి 111 మంది మరణించారు. వందల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆ దేశ అధికారులు తెలిపారు. అనేక భారీ భవనాలు కుప్పకూలాయి. వందల భవనాలు దెబ్బతిన్నాయి. భవనాల కింద చాలామంది చిక్కుకుపోయారు. బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టినట్లు ఆ దేశాధ్యక్షుడు అబెలార్డో డిలా ఎస్ర్పియెల్లా తెలిపారు. భూకంప కేంద్రం దేశ రాజధాని బొగోటాకు 400కిలోమీటర్ల దూరంలో చోకో ప్రావిన్స్‌లోని సాన్‌జో్‌స డెల్‌పాల్మర్‌కు 5 కిలోమీటర్ల దూరంలో భూ ఉపరితలానికి 107 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అమెరికా జియాలాజికల్‌ సర్వే సంస్థ వెల్లడించింది. ప్రజలంతా అప్పుడే నిద్రలేచి తమ రోజువారీ పనులను ప్రారంభిస్తున్న సమయంలో ఇళ్లన్నీ ఒక్కసారిగా ఊగిపోవటంతో భయంతో బయటకు పరుగులు తీశారు. రోడ్లపై పరుగులు తీస్తున్న ప్రజలపై భవనాల శకలాలు ఆకాశం నుంచి వచ్చి పడటంతో చాలామంది గాయపడ్డారు. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భూకంపానికి దేశంలో మూడో అతిపెద్ద నగరమైన కలి అధికంగా ప్రభావితమైంది.

ఇవి కూడా చదవండి:

ఫిట్‌నెస్‌ కోసం 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్‌ ఈసారైనా నిరూపించుకుంటాడా?

2027 వన్డే ప్రపంచకప్.. జట్టులో చేరేందుకు సిద్ధంగా ఉన్నా: భువనేశ్వర్ కుమార్

Updated Date - Aug 11 , 2026 | 05:07 AM