Cilia Flores: వెనెజువెలా అత్యంత శక్తివంతమైన మహిళపై అమెరికా కేసు
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:05 PM
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో భార్య సిలియా ఫ్లోరెస్ పై అమెరికా (యూఎస్) ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను సులభతరం చేయడానికి, దేశపు యాంటీ-డ్రగ్ కార్యాలయాన్ని మార్చడానికి పెద్దఎత్తున లంచం తీసుకున్నట్లు అమెరికా కేసులు పెట్టింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 4: వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో భార్య, ఫస్ట్ లేడీ సిలియా ఫ్లోరెస్ (69) దేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా పేరొందింది. 1990ల చివరి నుంచి మదురోతో రిలేషన్‌షిప్, 2013లో వివాహం చేసుకున్న ఆమె న్యాయవాది నేపథ్యం నుంచి వచ్చారు. హ్యూగో చావెజ్ సోషలిస్ట్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఆమె తన రాజకీయ శక్తిని ఉపయోగించి మదురో అధికారాన్ని బలోపేతం చేసింది.
ఇలా ఉంటే, అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ 2020లో మదురోపై పెట్టిన ఇండిక్ట్‌మెంట్‌ను నిన్న (2026 జనవరి 3న) అప్‌డేట్ చేసి సిలియాను కూడా డిఫెండెంట్‌గా చేర్చింది.
సిలియా ఫ్లోరెస్ మీద ఆరోపణలు..
2007లో డ్రగ్ ట్రాఫికర్‌తో మీటింగ్ ఏర్పాటు చేసి లక్షల డాలర్ల లంచాలు తీసుకున్నారని, కొకైన్ రవాణాకు సహకరించారని.. ఆమె కుటుంబ సభ్యులు (ముఖ్యంగా మునుపటి నెఫ్యూస్) కూడా డ్రగ్ ట్రాఫికింగ్‌లో పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
మదురోతో పాటు సిలియా కూడా నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ పాజిషన్ వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వెనెజువెలా నాయకులు 25 ఏళ్లుగా డ్రగ్ ట్రాఫికింగ్‌తో దేశ సంస్థలను దుర్వినియోగం చేశారని, మదురో-సిలియా దంపతులు దీని నుంచి లాభపడ్డారని అమెరికా ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న అమెరికా సైనిక చర్యలో మదురోతో పాటు సిలియాను కూడా నిర్బంధించి న్యూయార్క్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
ముస్తాఫిజూర్ చేసిన తప్పేంటి? ఉదాహరణలతో వివరించిన ఆకాశ్ చోప్రా
James Anderson: సచిన్, రోహిత్ కాదు..నా ఫేవరెట్ అతడే: అండర్సన్