Share News

పాకిస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధం విమానం.. పైలట్లు సురక్షితం..

ABN , Publish Date - May 20 , 2026 | 08:32 PM

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం కుప్పకూలింది. చైనా సహాయంతో తయారు చేసిన ఈ జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను పాక్ ఎయిర్‌ఫోర్స్ వినియోగిస్తోంది. తాజాగా తమ పైలట్లకు పాక్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఇది కుప్పకూలింది.

పాకిస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధం విమానం.. పైలట్లు సురక్షితం..
JF-17 crash Pakistan

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన జేఎఫ్-17 యుద్ధ విమానం కుప్పకూలింది. చైనా సహాయంతో తయారు చేసిన ఈ జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను పాక్ ఎయిర్‌ఫోర్స్ వినియోగిస్తోంది. తాజాగా తమ పైలట్లకు పాక్ ఎయిర్‌ఫోర్స్ శిక్షణ ఇస్తున్న సమయంలో ఇది కుప్పకూలింది. ఈ ఘటన పాకిస్థాన్‌లోని కమ్రా ప్రాంతంలో జరిగినట్లు వార్తలు వచ్చాయి (JF-17 crash Pakistan).


విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు ప్రమాదానికి ముందే సురక్షితంగా బయటపడినట్లు సమాచారం. అయితే వారికి గాయాలయ్యాయని స్థానిక మీడియా తెలిపింది. ఘటనలో పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంకేతిక లోపం కారణంగా విమానం కూలి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు (Pakistan Air Force jet crash).


సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో విమానం కూలే ముందు ఆకాశంలో ప్రయాణిస్తున్న దృశ్యాలు, అనంతరం పొగలు ఎగసిపడటం కనిపించింది (Chinese fighter jet crash). జేఎఫ్-17 థండర్ ఫైటర్ జెట్‌లను చైనా, పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ ఫైటర్ జెట్‌లను పాక్ ఎయిర్ ఫోర్స్ విస్తృతంగా ఉపయోగిస్తోంది. తక్కువ ఖర్చుతో మల్టీ-రోల్ యుద్ధ సామర్థ్యం కలిగిన విమానంగా దీనిని ప్రచారం చేస్తుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాల్లో జేఎఫ్-17 విమానాలు పలు ప్రమాదాలకు గురయ్యాయి.


ఇవి కూడా చదవండి..

రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..


చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ..

Updated Date - May 20 , 2026 | 08:32 PM