Pet Snake Bite: పాముకు గోరు ముద్దలు తినిపిస్తే ఇలానే అవుతుంది.. పాపం ఆ వ్యక్తి..
ABN , Publish Date - Jan 01 , 2026 | 04:13 PM
చైనాలోని బీజింగ్‌కు చెందిన ఓ వ్యక్తి పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది.
పాముకు పాలు పోసి ప్రేమగా పెంచినా.. ప్రాణంగా చూసుకున్నా అది విషమే కక్కుతుంది. అది దాని సహజ స్వభావం. మనం ఓనర్లమని.. పెంచుకుంటున్నామని దానికి తెలీదు. కొంచెం కోపం వచ్చినా దాని సహజ బుద్ధి చూపిస్తుంది. తన పదునైన కోరలను మన శరీరంలోకి దింపి ప్రాణం తీసే విషాన్ని మన శరీరంలోకి ఎక్కించేస్తుంది. విషం రక్తంలో కలిసిన తర్వాత చేసేదీ ఏమీ ఉండదు. అదృష్టం బాగుంటే బతికి బయటపడ్డమో.. లేదంటే పాడె ఎక్కటమో జరుగుతుంది. అత్యంత అరుదైన సందర్భాల్లో పాము కాటు వేసిన భాగాన్ని కోల్పోవల్సి వస్తుంది.
తాజాగా, చైనాకు చెందిన ఓ వ్యక్తికి ఇలానే జరిగింది. పెంపుడు పాము కాటు వేయటం వల్ల తన బొటన వేలిని కోల్పోయాడు. ఆరోగ్యం బాగోలేని పాముకు గోరు ముద్దలు తినిపించటంతో అతడికి ఈ పరిస్థితి వచ్చింది. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బీజింగ్‌కు చెందిన హాంగ్ అనే వ్యక్తి ఓ విషపు పామును పెంచుకుంటూ ఉన్నాడు. అది కొంత అనారోగ్యానికి గురైంది. ఏది పెట్టినా తినలేకపోతూ ఉంది. ఇది గమనించిన హాంగ్ తల్లడిల్లిపోయాడు. దాని ప్రాణాలు రక్షించడానికి స్వయంగా తనే గోరు ముద్దలు తినిపించాలని డిసైడ్ అయ్యాడు.
దానికి ఆహారం తినిపిస్తున్న సమయంలో ఠక్కున కాటేసింది. పెద్ద ఎత్తున విషం అతడి బొటన వేలులోకి వెళ్లింది. హాంగ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రికి వెళ్లాడు. అప్పటికే పరిస్థితి చెయ్యి దాటిపోయింది. విషం కారణంగా అతడి బొటన వేలు దెబ్బతింది. నెక్రోసిస్ అనే పరిస్థితి ఏర్పడింది. హాంగ్ బొటన వేలును పరీక్షించిన వైద్యులు చేతులెత్తేశారు. వేలు తీసేస్తే గానీ లాభం లేదని అన్నారు. దీంతో అతడు తన బొటన వేలును తీసేయించుకున్నాడు. హాంగ్‌కు చిన్నప్పటినుంచి పాములు పెంచుకోవటం అంటే సరదా. అది కూడా లాంగ్ నోస్డ్ పామును పెంచుకోవాలని అనుకునేవాడు. ఆ సరదానే అతడి వేలు పోయేలా చేసింది. ఇప్పుడు అతడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
ఫోన్ సిగ్నల్స్ లేక ఇబ్బందా? వెంటనే ఇలా చేయండి!
అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..