Share News

Vande Bharat Sleeper Train: అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..

ABN , Publish Date - Jan 01 , 2026 | 03:25 PM

తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.

Vande Bharat Sleeper Train: అతి త్వరలో ప్రారంభం కానున్న తొలి స్లీపర్ ట్రైన్.. రూటు, టికెట్ ధరల వివరాలివే..
Vande Bharat Sleeper Train

ఎంతగానో ఎదురుచూస్తున్న తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్ సర్వీస్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌కు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. గువహటి - కోల్‌కతాల మధ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడుస్తుందని అన్నారు. నిన్న(బుధవారం) 180 కిలోమీటర్ల స్పీడుతో వందే భారత్ స్లీపర్ ట్రైన్ పరీక్ష విజయవంతం అయిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను ప్రారంభిస్తారని అన్నారు.


ప్రారంభ తేదీ గురించి రెండు మూడు రోజుల్లో అప్‌డేట్ ఇస్తానని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా, అస్సాంలోని గువహటిల మధ్య నడిచే ఈ వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరలు విమాన టికెట్లకంటే చాలా తక్కువగా ఉంటాయని అన్నారు. వందే భారత్ స్లీపర్ ట్రైన్ టికెట్ ధరల విషయానికి వస్తే.. నాన్ ఏసీ టికెట్ ధర 2,300 రూపాయలు ఉంటుంది. అందులోనే ఆహారం కూడా అందిస్తారు. సెకండ్ ఏసీ టికెట్ ధర 3000 రూపాయలు ఉంటుంది. ఫస్ట్ ఏసీ టికెట్ ధర 3,600 రూపాయలు ఉంటుంది. అదే విమానంలో అయితే హౌరా ఎయిర్ ట్రావెల్స్ ధర 6 వేల రూపాయల నుంచి 8 వేల రూపాయల వరకు ఉంటుంది.


వందే భారత్ స్లీపర్ ట్రైన్‌లో ఉండే సేఫ్టీ ఫీచర్స్..

  • కవచ్ సేఫ్టీ సిస్టమ్.

  • క్రాష్ వర్తీ సెమీ పర్మినంట్ కప్లర్స్.

  • రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ.

  • కోచ్‌ల మధ్య ఫైర్ బ్యారియర్ డోర్స్.

  • ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ సిస్టమ్స్.

  • ఎరోసల్ బేస్డ్ ఫైర్ డిటెక్షన్ సిస్టమ్.

  • వీటితో పాటు అత్యాధునికమైన టాయిలెట్లు, సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్స్, డిజిటల్ ప్యాసెంజర్స్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ ఈ ట్రైన్‌లో ఉంటాయి.


ఇవి కూడా చదవండి

డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు స్వాహా

ఆడ, మగ తేడా లేదు.. అందరూ తప్ప తాగి నడిరోడ్లపై..

Updated Date - Jan 01 , 2026 | 03:38 PM