Share News

భూ కక్ష్యలోకి మరోసారి.. అంతరిక్ష విమానాన్ని రహస్యంగా ప్రవేశపెట్టిన చైనా..

ABN , Publish Date - Feb 24 , 2026 | 03:05 PM

చైనా మరోసారి తమ అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. షెన్‌లాంగ్‌ను చైనా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం.

భూ కక్ష్యలోకి మరోసారి.. అంతరిక్ష విమానాన్ని రహస్యంగా ప్రవేశపెట్టిన చైనా..
China secret space mission

చైనా మరోసారి తమ అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. గత కొంతకాలంగా చైనా అంతరిక్ష ప్రయోగాల్లో దూకుడు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి ఏడో తేదీన జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్-2 ఎఫ్ రాకెట్ సహాయంతో షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. షెన్‌లాంగ్‌ను చైనా భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం (China space plane).


షెన్‌లాంగ్ యాత్రలకు సంబంధించిన సమాచారాన్ని చైనా చాలా రహస్యంగా ఉంచుతోంది. దీంతో ఈ ప్రయోగాలపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలు దేశాలకు చెందిన అంతరిక్ష నిపుణులు, ట్రాకర్లు భూ కక్ష్యలోని షెన్‌లాంగ్‌ను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో షెన్‌లాంగ్ అంతరిక్ష విమానం కనిష్ఠంగా రెండు రోజుల నుంచి గరిష్ఠంగా ఎనిమిది నెలల వరకు భూ కక్ష్యలో ఉన్నట్టు వారు గుర్తించారు. ఆ సమయంలో అది భూ కక్ష్యలోకి చిన్న ఉపగ్రహాలను వంటి వాటిని విడుదల చేసినట్టు గుర్తించారు (classified space plane).


ట్రాక్ చేయడం తప్పించి ఈ షెన్‌లాంగ్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఎవరి వద్దా లేదు (Chinese space mission). భవిష్యత్తులో అంతరిక్షాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడం, తక్కువ ధరల్లోనే ప్రయోగాలను చేపట్టడం వంటి అంశాలపై అధ్యయనం చేసేందుకే తాము ఈ అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నట్టు చైనా గతంలో వెల్లడించింది. అయితే ఆ విమానం డిజైన్, దాని లక్ష్యాలు, ఎన్ని రోజులు అది కక్ష్యలో ఉండనుంది వంటి విషయాలను బయటకు వెల్లడించలేదు. చైనా 2020 నుంచి ఈ తరహా ప్రయోగాలను తరచుగా చేస్తోంది.


ఈ వార్తలూ చదవండి:

చలిలో వణుకుతున్న కుక్కకు దుప్పటి కప్పాడని జాబ్‌లోంచి తీసేశారు!

స్పృహ తప్పి పడిపోయిన వధువు! పెళ్లి రద్దు చేసుకున్న వరుడి ఫ్యామిలీ

Updated Date - Feb 24 , 2026 | 03:35 PM