మాపై నిందలేస్తే ఉపయోగం ఉండదు: నేపాల్‌కు తేల్చి చెప్పిన చైనా
ABN , Publish Date - Aug 27 , 2026 | 04:07 PM
నేపాల్‌లో వరదలకు తామే కారణమన్న వార్తలను చైనా తాజాగా తోసిచ్చింది. తమపై నిందలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: నేపాల్‌లో వరదలకు తామే కారణమన్న వార్తలను చైనా తాజాగా తోసిచ్చింది. తమపై నిందలేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేసింది. ఈ మేరకు నేపాల్‌లోని చైనా ఎంబసీ ఎక్స్ వేదికగా స్పందించింది. ఈ ప్రమాదంలో నేపాల్- టిబెట్ సరిహద్దు వద్ద అనేక మంది చైనీయులు కూడా కన్నుమూసిన విషయాన్ని పేర్కొంది. విపత్తుకు మూలం నేపాల్ భూభాగంలోనే ఉందని తేల్చి చెప్పింది.
‘జియోలాజికల్ డిజాస్టర్ డ్యామ్’ ఆరోపణలతో కలకలం..
టిబెట్ ప్రాంతంలో పొంచి ఉన్న ప్రకృతి విపత్తు గురించి తమను చైనా ముందుగా హెచ్చరించలేదని నేపాల్ అధికారులు అన్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిపుణులు చెప్పేదాని ప్రకారం, భూకంపాల సమయంలో కొండచరియలు విరిగి నదీ ప్రవాహనానికి అడ్డుగా ఓ డ్యామ్ లాగా పేరుకుపోయి ‘డిజాస్టర్ డ్యామ్స్’ ఏర్పడతాయి. ఈ డిజాస్టర్ డ్యామ్‌లు ఆ తరువాత ఏ కారణంతోనైనా తెగిపోతే ఎగువన అప్పటివరకూ నిలిచున్న భారీ జలరాశి ఒక్కసారిగా విరుచుకుపడుతుంది. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రయళం సృష్టిస్తుంది. నేపాల్‌కు ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి ముప్పు ఏర్పడి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి
నేపాల్-టిబెట్ సరిహద్దులను బుధవారం ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. దిగువన ఉన్న జిల్లాలు కూడా నీట మునిగాయి. టిబెట్‌లో మంచుచరియలు విరిగిపడటంతో వరద ప్రారంభమై ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు ఇందుకు భూకంపం కారణమై ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి. అయితే, టిబెట్‌లో ఎలాంటి భూకంపం సంభవించలేదని యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. కొండచరియలు/మంచుచరియలు ఒక్కసారిగా విరిగిపడటంతోనే భూమి కంపించి రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత నమోదైందని తెలిపింది. నేపాల్ వైపున హిమనదం లేదా మంచుచరియ విరిగి పడటం లేదా భూకంపం సంభవించడంతోనే ఈ విపత్తు ముంచెత్తిందని చైనా చెబుతోంది. దీంతో, అసలు ఏం జరిగిందనే దానిపై సస్పెన్స్ నెలకొంది.
ఈ వార్తలనూ చదవండి:
నేపాల్ టూరిజం బోర్డు కీలక ప్రకటన.. గల్లంతైన వారిలో 178 మంది భారతీయులు..
అలాస్కాలో కూలిన విమానం.. నలుగురి మృతి