సైబర్ నేరాలపై చైనా ఉక్కు పాదం.. 11 మంది నేరస్థులకు ఉరిశిక్ష..
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:11 PM
వేలాది కోట్ల రూపాయల స్కామ్‌లు, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన 11 మంది సభ్యులకు చైనా మరణ శిక్ష అమలు చేసింది. ఆన్‌లైన్ మోసాలతో పాటు పలు కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు.
వేలాది కోట్ల రూపాయల స్కామ్‌లు, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడిన 11 మంది సభ్యులకు చైనా మరణ శిక్ష అమలు చేసింది. ఆన్‌లైన్ మోసాలతో పాటు పలు కేసుల్లో ఈ 11 మంది నిందితులుగా ఉన్నారు. స్కామ్‌లకు పాల్పడి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన ఈ ముఠా ఆధ్వర్యంలో కొందరు చైనీయులు సహాయకులుగా పని చేశారు. వారు పని మానేసి తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఈ ముఠా చంపేసింది (China scam crackdown).
ఈ ముఠా చేతిలో మొత్తం 14 మంది చైనీయులు ప్రాణాలు కోల్పోయారనే ఆరోపణలు ఉన్నాయి. ఉత్తర మయన్మార్‌లోని కొన్ని కుటుంబాలు ఇంటర్నెట్ స్కామ్‌లు, వ్యభిచారం, డ్రగ్స్ రవాణా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాయి. ఇలాంటి నేరాల్లో మింగ్ ఫ్యామిలీతో పాటు మరో నాలుగు కుటుంబాలు ఆరి తేరాయి. వీరు వేలాది మందిని నియమించుకుని ఆన్‌లైన్ స్కీములతో మోసాలు, నేరాలకు పాల్పడుతున్నట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, స్థానిక ప్రభుత్వంలో కూడా వీరు కీలక పాత్ర పోషిస్తున్నారని వార్తలు ఉన్నాయి (Myanmar scam networks).
ఈ కుటుంబాల మోసాలు, నేరాలపై గత కొన్నేళ్లుగా ఫిర్యాదులు వస్తుండడంతో మయన్మార్‌పై చైనా ఒత్తిడి తీసుకొచ్చింది (China executions). దీంతో మయన్మార్ ఆ నేరస్థులను 2023 నవంబర్‌లో చైనాకు అప్పగించింది. వీరిలో మింగ్ కుటుంబ పెద్ద కస్టడీలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ మోసాలపై విచారణ అనంతరం 11 మందిని దోషులుగా తేల్చిన వెంజౌ సిటీ కోర్టు వారికి మరణ శిక్ష విధించింది. తాజాగా ఆ మరణ శిక్షను అమలు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఫోన్ కెమెరా.. రెడ్ టేప్ ఎందుకు వేశారు..
యుద్ధ భయంతో తాత చేసిన పని.. 80 ఏళ్ల తర్వాత మనవడికి కలిసొచ్చింది..