ఇక ఆపండి.. ఖమేనీ మృతిపై చైనా, నార్త్ కొరియా తొలి రియాక్షన్
ABN , Publish Date - Mar 01 , 2026 | 06:43 PM
అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టడాన్ని చైనా, ఉత్తర కొరియా దేశాలు ఖండించాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపడం ఆదేశ స్వారభౌమాధికారం, భద్రతను ఉల్లంఘించడమే అవుతుందని చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని మట్టుబెట్టడాన్ని చైనా, ఉత్తర కొరియా దేశాలు ఖండించాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ను చంపడం ఆదేశ స్వారభౌమాధికారం, భద్రతా నియమాలను ఉల్లంఘించడమే అవుతుందని చైనా విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ సంబంధాలపై యూఎన్ చార్టర్, నిబంధలను ఉల్లంఘించారని ఆక్షేపణ తెలిపింది. చైనా ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంది.
'మధ్యప్రాచ్యంలోనే కాకుండా ప్రపంచదేశాల్లో శాంతి, సుస్ధిరత నెలకొనాలంటే ఉద్రిక్తతలు మరింత పెరగకూడదు. తక్షణం సైనిక చర్యలను నిలిపివేయాలని మేము కోరుతున్నాం' అని చైనా విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో కోరింది. నార్త్ కొరియా సైతం ఇజ్రాయెల్-అమెరికా సైనిక చర్యను ఖండించింది. ఇది జాతీయ భద్రతా ఉల్లంఘనేనని స్పష్టం చేసింది.
కిరాతక హత్య: పుతిన్
అయతుల్లా ఖమేనీ హత్యను రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఇది 'కిరాతక హత్య'అని, నైతిక విలువలు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి హత్యచేశారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఖమేనీ కుటుంబ సబ్యులు, సన్నిహితులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
బ్రిటిష్ , ఫ్రాన్స్, జర్మనీ, సౌదీ అరేబియా స్పందన
అమెరికా, ఇరాన్ తిరిగి చర్చలు ప్రారంభించాలని బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మెర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కోరారు. మద్యప్రాచ్చంలోని దేశాలపై ఇరాన్ దాడులను ఖండించారు. సంయమనం పాటించాలని, అంతిమంగా తమ భవిషత్తును నిర్ణయించుకునే అవకాశం ఇరాన్ ప్రజలకు ఇవ్వాలని సూచించాయి. యూఏఈ, బెహ్రయిన్, ఖతార్, కువైట్, జోర్దాన్ దైశాలపై ఇరాన్ దాడులను సౌదీ అరేబియా, గల్ఫ్ దేశాలు ఖండించాయి. సార్వభౌమాధికార ఉల్లంఘనలుగా ఈ దాడులను పేర్కొన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా అయతుల్లా అలిరేజా అరాఫీ
ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడి.. శనివారం ఉదయమే ఎందుకు చేశారు?