యుద్ధంతో గల్ఫ్‌లోని విద్యార్థులకు నష్టం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:42 AM
ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో 12వ తరగతి పరీక్షలను సీబీఎ్‌సఈ రద్దు చేయడంతో అయోమయ స్థితి నెలకొంది. 12వ తరగతి పరీక్షల్లో కొన్నింటిని రద్దుచేసి, దానికి బదులుగా...
12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన సీబీఎస్ఈ
సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలి: ప్రవాసీ టీడీపీ నేతల లేఖ
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలలో 12వ తరగతి పరీక్షలను సీబీఎ్‌సఈ రద్దు చేయడంతో అయోమయ స్థితి నెలకొంది. 12వ తరగతి పరీక్షల్లో కొన్నింటిని రద్దుచేసి, దానికి బదులుగా ఒక అంచనా ప్రకారం మార్కులు వేశారు. దీంతో గల్ఫ్ దేశాలలోని ప్రవాస భారతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అర్హత కోల్పోయే ప్రమాదం ఉందని గల్ఫ్‌లోని టీడీసీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైత్, బహ్రెయిన్, ఒమాన్ దేశాల్లోని సుమారు 20వేల మంది విద్యార్థులు మార్చిలో 12వ తరగతి పరీక్షలు రాస్తుండగా యుద్థం కారణంగా కొన్ని పరీక్షలను రద్దు చేశారు. అంతర్గత అంచనాల ప్రకారం మార్కులు కేటాయించడంతో, తక్కువ మార్కులు వచ్చి ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కోల్పోతున్నారని టీడీపీ గల్ఫ్ అధ్యక్షుడు రావి రాధాకృష్ణ, నాయకులు జానీ బాషా, చెన్నుపాటి రాజశేఖర్ తెలిపారు. గల్ఫ్‌లో పెద్దసంఖ్యలో తెలుగు విద్యార్థులు ఉన్నందున వారి భవిష్యత్తు దృష్ట్యా సీఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో 198 సీబీఎ్‌సఈ పాఠశాలలు ఉండగా, సుమారు లక్షా 80వేల మంది విద్యార్థులు ఉన్నారని టీడీపీ నేతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు
పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్