Share News

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు.. బిల్‌గేట్స్‌కు ఆ వ్యాధి.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన విషయాలు..

ABN , Publish Date - Jan 31 , 2026 | 07:08 PM

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యన్ అమ్మాయిలతో బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందువల్లే ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారనే ఆరోపణ బయటకు వచ్చింది.

రష్యన్ అమ్మాయిలతో సంబంధాలు.. బిల్‌గేట్స్‌కు ఆ వ్యాధి.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలన విషయాలు..
Bill Gates controversy

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సంబంధించి ఓ సంచలన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యన్ అమ్మాయిలతో బిల్‌గేట్స్‌కు లైంగిక సంబంధాలు ఉన్నాయని, అందువల్లే ఆయన సుఖ వ్యాధుల బారిన పడ్డారనే ఆరోపణ బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోన్న ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణం విచారణకు సంబంధించి 30 లక్షల పేజీలను అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సంగతి తెలిసిందే (Bill Gates Epstein files).


2013లో తనకు తాను రాసుకున్న ఈ-మెయిల్‌లో ఎప్‌స్టీన్ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు సమాచారం. రష్యా అమ్మాయిలతో గేట్స్ శృంగార సంబంధాలు సాగించారని, ఫలితంగా ఆయన లైంగిక వ్యాధుల బారిన పడ్డారని ఎప్‌స్టీన్ పేర్కొన్నారు. ఆ విషయం బయట పడకుండా ఉండడం కోసం తన భార్య మిలిందాకు గేట్స్ రహస్యంగా యాంటీబయాటిక్స్ ఇవ్వాలనుకున్నారని, తనను ఆ మాత్రలు అడిగారని ఎప్‌స్టీన్ తెలిపారు. ఆ తర్వాత తనతో స్నేహాన్ని గేట్స్ తెంచుకున్నారని కూడా అదే మెయిల్‌లో ఎప్‌స్టీన్ పేర్కొన్నారు (Epstein documents claims).


ఎప్‌స్టీన్ ఫైల్స్‌లోని ఆరోపణలను గేట్స్ బృందం తీవ్రంగా ఖండించింది (Epstein scandal latest). ఇవి పూర్తిగా అసంబద్ధమైనవని, తనతో స్నేహం కొనసాగించకపోవడం వల్లే ఎప్‌స్టీన్ నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొంది. అంతేకాదు, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌కు సంబంధించిన అంశాలు కూడా ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్నాయి. వర్జిన్ దీవులలోని తన ఐల్యాండ్‌ను సందర్శించాలని తాను మస్క్‌ను ఆహ్వానించానని, అయితే తన ఆహ్వానాన్ని మస్క్ పలుసార్లు తిరస్కరించారని కూడా ఎప్‌స్టీన్ పేర్కొన్నారు.


ఇవీ చదవండి:

భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్

కాంగోలో కుప్పకూలిన గని.. 200 మంది దుర్మరణం..

Updated Date - Jan 31 , 2026 | 07:14 PM