న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కత్తులతో మహిళ దాడి
ABN , Publish Date - Sep 03 , 2026 | 06:05 AM
అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి...
బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ మృతి
న్యూయార్క్, సెప్టెంబరు 2: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో జరిగిన దాడిలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఎరిన్ పియాసెంటి (32) మృతి చెందారు. ఓ 49 ఏళ్ల మహిళ తనతో పాటు బ్యాగులో తెచ్చుకున్న రెండు కత్తులతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద సోమవారం వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. అక్కడ ఉన్న ఇద్దరిపై ఆమె విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఎరిన్ పియాసెంటి అక్కడికక్కడే మృతిచెందగా.. 68 ఏళ్ల మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితురాలు పోలీసులపైకీ దూసుకెళ్లడంతో వారు ఘటనా స్థలంలోనే ఆమెను కాల్చి చంపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి
వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..