Share News

పాక్‌ సైనికులపై తూటాల వర్షం.. బలోచ్ యువతి వీరత్వం

ABN , Publish Date - Feb 02 , 2026 | 09:41 PM

పాక్‌లోని బలోచిస్థాన్ ప్రావిన్స్‌కు స్వాతంత్ర్యం కోసం ఓ మహిళా ఫైటర్ ఆత్మబలిదానం చేసిన వీడియో వైరల్‌గా మారింది. బలోచ్ లిబరేషన్ ఆర్మీ స్వయంగా ఈ వీడియోను రిలీజ్ చేసింది.

పాక్‌ సైనికులపై తూటాల వర్షం.. బలోచ్ యువతి వీరత్వం
Baloch Fidayeen Fighter Viral Video

ఇంటర్నెట్ డెస్క్: పాక్ పాలకుల అణచివేతకు వ్యతిరేకంగా బలోచిస్థాన్‌లోని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) పోరాటం చేస్తోంది. తాజాగా మహిళా ఆత్మాహుతి బాంబర్లను కూడా రంగంలోకి దింపింది. ఇటీవల పలు చోట్ల ఏకకాలంలో బీఎల్ఏ మహిళలు ఆత్మాహుతి దాడులు చేశారు. ఈ సందర్భంగా బీఎల్ఏ హవా బలోచ్ (Hawa Baloch) అనే యోధురాలి వీడియోను షేర్ చేసింది.

ఆపరేషన్ హెరాఫ్ (Operation Herof) పేరిట బీఎల్ఏ గ్వదార్ ప్రాంతంలో ఈ దాడులు చేసింది. ఇందులో పాల్గొన్న హవా బలోచ్ పాక్ దళాలపై తూటాల వర్షం కురిపించారు. మరణానికి ముందు ఆమె పంపిన చివరి సందేశం ఇదేనని బీఎల్ఏ వీడియోలో పేర్కొంది (BLA Viral Video).

వీడియోలో హవా బలోచ్ పాక్ సైనికులకు చుక్కలు చూపించారు. తమతో పోరాడే ధైర్యం వారికి లేదన్నారు. యుద్ధాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. బలోచ్ ప్రజలందరూ ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. శత్రువుల రాక కోసం ఎదురు చూస్తున్నా ఒక్కరు కూడా కానరావట్లేదని పాక్‌ను ఎద్దేవా చేశారు. తమ ధాటికి కకావికలమైన పాక్ సైనికుల రోదనలు తమకు వినిపిస్తున్నాయని అన్నారు. తమను ఎదుర్కునే సామర్థ్యం వారికి లేనేలేదని చెప్పారు. చిల్లర డబ్బుల కోసం శత్రువులకు వంతపాడే వారు తమ మధ్య ఉన్నారని కూడా విచారం వ్యక్తం చేశారు. తమ ఫైటర్లు ఎందరో పాక్ దళాలపై ఆత్మాహుతి దాడులతో ప్రాణత్యాగం చేశారని అన్నారు. వీడియో చివర్లో రక్తసిక్తమైన ఆమె మృతదేహం కనిపించింది (BLA Attack Gwadar).


మీడియా కథనాల ప్రకారం, హవా బలోచ్ జెన్ జీ తరానికి చెందిన యువతి. ఆమె తండ్రి కూడా బీఎల్ఏలో సైనికుడే. 2021 నాటి పాక్ దాడుల్లో కన్నుమూశాడు. బీఎల్ఏలో చేరకముందు ఆమె బాల్యం అందరి చిన్నారుల్లాగానే గడిచింది. ఆ తరువాత బీఎల్ఏ వైపు ఆకర్షితురాలైంది. పాక్‌ ప్రావిన్స్ అయిన బలోచిస్థాన్ ఎంతో కాలంగా స్వాతంత్రం కోరుకుంటోంది. పాక్ పాలకులు తమ ప్రాంత వనరులను దోచుకుంటూ తమను అణచివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక పాక్ అణచివేతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసేందుకు బీఎల్ఏ ఉనికిలోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి..

దలైలామాకు గ్రామీ అవార్డును ఖండించిన చైనా

రెండ్రోజుల్లో డీల్ కుదరకపోతే.. అది నిజమో, కాదో తేలుతుంది.. ఇరాన్ వార్నింగ్‌పై ట్రంప్ రియాక్షన్..

Updated Date - Feb 02 , 2026 | 09:54 PM