Share News

బ్రిటన్‌ కొత్త ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌

ABN , Publish Date - Jul 18 , 2026 | 06:10 AM

బ్రిటన్‌లో అధికారంలో ఉన్న లేబర్‌ పార్టీకి కొత్త నాయకుడిగా అండీ బర్న్‌హామ్‌ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు...

బ్రిటన్‌ కొత్త ప్రధాని ఆండీ బర్న్‌హామ్‌

  • లేబర్‌ పార్టీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

లండన్‌, జూలై 17: బ్రిటన్‌లో అధికారంలో ఉన్న లేబర్‌ పార్టీకి కొత్త నాయకుడిగా అండీ బర్న్‌హామ్‌ శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆయన బ్రిటన్‌ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సోమవారం కింగ్‌ చార్ల్స్‌-3కు రాజీనామా సమర్పించిన అనంతరం, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బర్న్‌హామ్‌ను కింగ్‌ చార్ల్స్‌-3 ఆహ్వానించనున్నారు. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లోని లేబర్‌ పార్టీకిచెందిన 403 మంది ఎంపీల్లో 379 మంది ఆయనకు మద్దతు తెలిపారు. లండన్‌లో నిర్వహించిన లేబర్‌ పార్టీ ప్రత్యేక సమావేశం జాతీయ కార్యవర్గం(ఎన్‌ఈసీ) చైర్‌పర్సన్‌ షబానా మహ్మూద్‌ ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

మూగజీవాలకు అపన్నహస్తం..

తప్పిపోయిన 35 ఏళ్ల తర్వాత.. అమ్మకు దగ్గరైన కూతురు

Updated Date - Jul 18 , 2026 | 06:10 AM