బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్‌హామ్ బాధ్యతలు
ABN , Publish Date - Jul 21 , 2026 | 06:13 AM
బ్రిటన్ కొత్త ప్రధానిగా లేబర్‌పార్టీ నూతన నాయకుడు ఆండీ బర్న్‌హామ్ (56) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేయడంతో బర్న్‌హామ్‌ను...
లండన్, జూలై 20: బ్రిటన్ కొత్త ప్రధానిగా లేబర్‌పార్టీ నూతన నాయకుడు ఆండీ బర్న్‌హామ్ (56) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా చేయడంతో బర్న్‌హామ్‌ను నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా బ్రిటన్ రాజు చార్లెస్- 3 ఆహ్వానించారు. గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయర్ అయిన బర్న్‌హామ్ గతవారమే లేబర్‌పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. నాలుగేళ్లలో బ్రిటన్‌కు ఐదో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన బర్న్‌హామ్.. దేశంలో ‘‘స్థిరమైన, బాధ్యతాయుతమైన’’ పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. అంతకుముందు బ్రిటన్ ప్రధాని అధికార నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి కీర్ స్టార్మర్ దేశ ప్రజలను ఉద్దేశించి చివరిసారిగా ప్రసంగించారు. ఆండీ బర్న్‌హామ్‌కు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి...
విక్రమ్-1 విజయంలో తెలుగు తేజాల కృషి
ఇంట్లోంచి వెళ్లిపోయిన ఆరేళ్ల చిన్నారి.. జొన్నచేనులో నిద్రిస్తూ.