అలాంటి దాడులు మరిన్ని జరగాలి: అల్‌ఖైదా
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:17 AM
ఫ్లైదుబాయ్ ఉదంతం నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మరో సంచలనానికి తెరతీసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైదుబాయ్ ఉదంతం నేపథ్యంలో ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా మరో సంచలనానికి తెరతీసినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఫ్లైదుబాయ్ ఉదంతంతో పాటు 9/11 దాడుల గురించి ప్రస్తావించిన అల్ ఖైదా అలాంటి దాడులు మరిన్ని జరగాలని కోరుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. సంస్థ మద్దతుదారులు ప్రచురించే అల్ బయాన్ పత్రికలో ఈ విషయం ప్రచురితమైనట్టు సమాచారం. ఈ పత్రిక డిజిటల్ కాపీలు సంబంధిత టెలిగ్రామ్ ఛానల్స్‌లో వైరల్‌గా మారాయి. ఆ తరువాత వాటిని తొలగించినట్టు కూడా తెలిసింది.
అమెరికన్లు, ఇజ్రాయెలీలు ప్రయాణించే విమానాల్ని టార్గెట్ చేయాలని అల్ ఖైదీ పిలుపునిచ్చినట్టు సమాచారం. ‘యుద్ధం ముగియలేదు. జియోనిస్టులు (యూదుజాతీయ వాదులు), అమెరికన్లు, ఇస్లామ్‌కు వ్యతిరేకంగా ఉన్న వారు గగనతలంలో అనే మంది ఉన్నారు. సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 30 ఘటనల్లో లాగా వారిని టార్గెట్ చేయొచ్చు’ అని పత్రికలో ఉన్నట్టు తెలిసింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఢీకొట్టిన విమానాల చిత్రాలను కూడా పత్రికలో ముద్రించినట్టు సమాచారం. ఫ్లైదుబాయ్ చిత్రం ఇమేజీని కూడా చేర్చినట్టు తెలిసింది. గతంలో కంటే ఎక్కువగా ఇప్పుడు అమెరికన్లకు, జియోనిస్టులకు శత్రువులు ఉన్నారు’ అని పేర్కొనట్టు తెలిసింది. అమెరికా సామ్రాజ్యం కూలిపోయే రోజు ఒకటి వస్తుందని కూడా అల్ ఖైదా పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫ్లైదుబాయ్ ఉదంతం.. విమానంలోని ఆ ఇద్దరూ ఎవరు?
మిడ్‌టర్మ్ ఎన్నికలు.. వృద్ధులకు ట్రంప్ బంపర్ ఆఫర్