కార్లపైకి దూసుకెళ్లిన బస్సు.. ఐదుగురి మృతి, 34 మందికి గాయాలు..
ABN , Publish Date - May 30 , 2026 | 08:01 AM
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు కార్లపైకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు చనిపోగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
న్యూయార్క్, మే 30: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు కార్లపైకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు చనిపోగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. నార్త్ కరోలినాలోని కింగ్స్ మౌంటెన్‌కు చెందిన ఈ అండ్ పీ ట్రావెల్ బస్సు న్యూయార్క్ సిటీలోని సౌంత్‌బౌండ్ నుంచి నార్త్ కరోలినాలోని చార్‌లోట్ బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 2.40 గంటల ప్రాంతంలో వర్జీనియాలోని ఇంటర్‌స్టేట్ 95 వద్ద బస్సు ప్రమాదానికి గురైంది.
వర్క్ జోన్ దగ్గర వాహనాలన్నీ స్లో అవుతున్నాయి. అయితే, అతి వేగంగా వచ్చిన బస్సు వర్క్ జోన్ దగ్గర స్లో అవ్వలేకపోయింది. ముందున్న కార్లపైకి దూసుకెళ్లింది. బస్సు కారణంగా పలు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. 34 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
బస్సు ఢీ కొట్టడం కారణంగా ఓ కారు నుజ్జునుజ్జవ్వటంతో పాటు కారులో మంటలు కూడా చెలరేగాయి. కారులో ఉన్న నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వారిని గ్రీన్‌ఫీల్డ్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు బస్సు డ్రైవర్ 48 ఏళ్ల జింగ్ ఎస్ డాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ‘ది నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ సేఫ్టీ బోర్డ్’ స్పందించింది. సేఫ్టీ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ప్రమాదం జరిగిన చోటుకు ‘గో టీమ్’ను పంపినట్లు తెలిపింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
ఇవి కూడా చదవండి
కర్ణాటక విజయపుర జిల్లాలో దారుణం.. ఆరుగురిని నరికి చంపిన ప్రత్యర్థులు..
జీహెచ్‌ఎంసీలో ఎలక్ట్రిక్ కార్లు