రోజూ 5 నిమిషాలు.. ఈ వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చు!
ABN , Publish Date - Jun 17 , 2026 | 08:02 AM
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా వ్యాయామానికి సమయం కేటాయించలేకపోతుంటారు. అలాంటి వారి కోసం కేవలం 5 నిమిషాల్లో పూర్తయ్యే HIIT వర్కౌట్ మంచి పరిష్కారం.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే ఉద్యోగం, పనుల ఒత్తిడి, తీరికలేని జీవనశైలి కారణంగా చాలామందికి వ్యాయామం చేయడానికి సమయం దొరకదు. మరికొందరికి జిమ్‌లో గంటల తరబడి కష్టపడటం ఇష్టం ఉండదు. అలాంటి వారికి కేవలం 5 నిమిషాల్లో పూర్తయ్యే హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (HIIT) మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు. ఈ వ్యాయామానికి ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ప్రతి వ్యాయామాన్ని 45 సెకన్లు చేయాలి. తర్వాత 15 సెకన్లు విశ్రాంతి తీసుకుని తదుపరి వ్యాయామానికి వెళ్లాలి.
జంపింగ్ జాక్స్
మొదట 45 సెకన్ల పాటు జంపింగ్ జాక్స్ చేయాలి. ఇది శరీరాన్ని వార్మప్ చేయడంలో సహాయపడుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కండరాలు చురుకుగా పనిచేసేలా చేస్తుంది. శరీరమంతా కదలికలోకి రావడానికి ఇది మంచి వ్యాయామం.

స్క్వాట్స్
తర్వాత 45 సెకన్ల పాటు స్క్వాట్స్ చేయాలి. ఇవి తొడలు, తుంటి కండరాలను బలపరుస్తాయి. అలాగే పొట్ట, నడుము భాగంలోని కండరాల శక్తిని పెంచుతాయి. శరీర సమతుల్యత, సహనాన్ని మెరుగుపరుస్తాయి.

పుష్-అప్స్
45 సెకన్ల పాటు పుష్-అప్స్ చేయాలి. ఇవి ఛాతీ, భుజాలు, చేతులు, కోర్ కండరాలను బలపరుస్తాయి. శరీర బరువునే ఉపయోగించి చేసే ఈ వ్యాయామం కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

మౌంటైన్ క్లైంబర్స్
పొట్ట కొవ్వు తగ్గించడంలో, శరీరాన్ని చురుకుగా ఉంచడంలో మౌంటెన్ క్లైంబర్స్ ఉపయోగపడతాయి. 45 సెకన్ల పాటు ఈ వ్యాయామం చేస్తే గుండె వేగం పెరిగి క్యాలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి.

ప్లాంక్
చివరిగా 45 సెకన్ల పాటు ప్లాంక్ చేయాలి. ఇది పొట్ట, నడుము, భుజాల కండరాలను బలపరుస్తుంది. శరీర స్థిరత్వాన్ని పెంచి, సరైన భంగిమను కాపాడటానికి సహాయపడుతుంది.

ప్రయోజనాలు
కేవలం 5 నిమిషాల పాటు ఈ వ్యాయామాలు చేసినా శరీరంలోని ప్రధాన కండర సమూహాలు చురుకుగా పనిచేస్తాయి. రోజువారీ శక్తి స్థాయిలు పెరుగుతాయి. శారీరక దృఢత్వం మెరుగుపడి, ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. కాబట్టి సమయం తక్కువగా ఉన్నవారు కూడా రోజూ ఈ 5 నిమిషాల వ్యాయామాన్ని అలవాటు చేసుకోవచ్చు.
Note: ఇందులోని సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే.. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఎలక్ట్రిక్ కారుతో సుదూర ప్రయాణం? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎంతటి జ్ఞానవంతుడైనా ఈ తప్పులు చేస్తే కష్టాలు తప్పవు