Share News

ఉదయాన్నే ఇలా చేస్తే.. రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు!

ABN , Publish Date - Feb 09 , 2026 | 07:44 AM

ఉదయం నిద్రలేచిన వెంటనే చేసే కొన్ని చిన్న పనులు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఈ సులభమైన మార్నింగ్ చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండటంతో పాటు రోజంతా ఫ్రెష్‌గా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయాన్నే ఇలా చేస్తే.. రోజంతా ఫ్రెష్‌గా ఉంటారు!
Morning Tips

ఇంటర్నెట్ డెస్క్: పేగు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే కొన్ని సాధారణ అలవాట్ల వల్ల పేగులు శుభ్రంగా ఉంటాయి. ఈ సులభమైన మార్నింగ్ చిట్కాలను పాటిస్తే ఆరోగ్యంగా ఉండటంతోపాటు రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


గోరువెచ్చని నీరు తాగాలి..

రాత్రంతా నిద్ర తర్వాత శరీరానికి నీటి కొరత ఉంటుంది. అందువల్ల ఉదయం గోరువెచ్చని నీరు తాగడం మంచిది. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే జీర్ణవ్యవస్థ యాక్టివ్ అవుతుంది.

తేలికపాటి వ్యాయామం..

ఉదయం 10–15 నిమిషాలు వాకింగ్, యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు యాక్టివ్ అవుతాయి. గ్యాస్, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి.

ఫైబర్ ఫుడ్స్..

ఓట్స్, పండ్లు, చియా గింజలు, ధాన్యాలు వంటివి పేగులకు చాలా మంచివి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, మలబద్ధకం రాకుండా చూస్తాయి.


ప్రోటీన్..

గుడ్లు, పెరుగు, పన్నీర్, టోఫు లాంటి ప్రోటీన్ ఆహారాలు కడుపును బలంగా ఉంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తాయి.

అల్లం టీ లేదా నిమ్మకాయ నీరు..

అల్లం టీ కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. నిమ్మకాయ కలిపిన గోరువెచ్చని నీరు కూడా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

సూర్యకాంతి..

ఉదయం 10–15 నిమిషాలు సూర్యరశ్మిలో నిలబడండి. విటమిన్ D పెరిగి జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 09 , 2026 | 09:24 AM