Share News

బరువు తగ్గడానికి చపాతీలు తింటున్నారా? ఇది తెలుసుకోండి

ABN , Publish Date - Mar 01 , 2026 | 11:28 AM

చాలా మంది బరువు తగ్గడానికి చపాతీలు ఎక్కువగా తింటారు. అయితే, చపాతీలు తింటే నిజంగా బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి చపాతీలు తింటున్నారా? ఇది తెలుసుకోండి
Chapati For Weight Loss

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో వేగవంతమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా అధిక బరువున్నవారి సంఖ్య పెరుగుతోంది. బరువు తగ్గడానికి కొంతమంది జిమ్‌లో కష్టపడతారు, మరికొందరు ఆహారంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. చాలా మంది బరువు తగ్గడానికి చపాతీలు ఎక్కువగా తింటారు. అయితే, చపాతీలు తింటే నిజంగా బరువు తగ్గుతారా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం..


బరువు తగ్గడానికి చపాతీలు ఎలా సహాయపడతాయి?

అధిక ఫైబర్: గోధుమ పిండిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అనవసరమైన స్నాక్స్ తినకుండా ఉంటారు.

తక్కువ క్యాలరీలు: అన్నంతో పోలిస్తే ఒక మీడియం చపాతీలో 70-120 క్యాలరీలు మాత్రమే ఉంటాయి (నూనె లేకుండా)ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

పోషకాలు: చపాతీలలో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు ఉంటాయి. రోజుకు 2-3 చపాతీలు తింటే సరిపోతుంది. ఎక్కువగా తింటే క్యాలరీలు పెరిగి బరువు తగ్గరని గుర్తించుకోండి. చపాతీ చేసేటప్పుడు నూనె లేదా నెయ్యి వాడకపోవడం మంచిది.


కేవలం గోధుమ పిండి కాకుండా జొన్న, సజ్జ లేదా రాగి వంటి చిరుధాన్యాల పిండితో చేసిన చపాతీలు ఎక్కువ ఫైబర్, ప్రోటీన్ అందించి వేగంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. చపాతీని పప్పు లేదా ప్రోటీన్ అధికంగా ఉండే ఇతర పదార్థాలతో కలిపి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Updated Date - Mar 01 , 2026 | 11:31 AM