Share News

Heart Health in Winter: చలికాలం.. గుండెకు ముప్పు తెచ్చే ఆహారాలు ఇవే!

ABN , Publish Date - Jan 09 , 2026 | 07:57 AM

శీతాకాలంలో గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అందువల్ల, ఈ సీజన్‌లో మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. గుండెను బలహీనపరిచే ఆహారాలను ఎక్కువగా తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు..

Heart Health in Winter: చలికాలం.. గుండెకు ముప్పు తెచ్చే ఆహారాలు ఇవే!
Heart Health in Winter

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో గుండె ఆరోగ్యం ఎక్కువగా ప్రభావితమవుతుంది. అందుకే ఈ సీజన్‌లో మనం తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. శీతాకాలంలో కొన్ని ఆహారాలు గుండెను బలహీనపరుస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలి కాలంలో శరీర జీవక్రియ (మెటబాలిజం) మందగిస్తుంది. ఈ సమయంలో ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్, కారంగా, ఉప్పగా ఉండే ఆహారం తీసుకుంటే గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ అవుతుంది. కాబట్టి, ఈ సీజన్‌లో గుండెకు ముప్పు తెచ్చే ఈ మూడు ఆహారాలను తినకపోవడం మంచిదని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


శీతాకాలంలో గుండెను బలహీనపరచే 3 ఆహారాలు

  • వేయించిన, కారంగా ఉండే ఆహారాలు: ఇవి రక్తపోటును పెంచి, కొలెస్ట్రాల్ స్థాయిని ప్రభావితం చేస్తాయి. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

  • ఎక్కువ ఉప్పు, తీపి ఉన్న ఆహారాలు: అధిక ఉప్పు తీసుకోవడం వల్ల గుండెపై భారం పెరుగుతుంది. కాబట్టి, వీటిని తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

  • ఎర్ర మాంసం (రెడ్ మీట్): ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల గుండెకు హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఆహారాలను తరచుగా తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మందగించి, గుండెపై అదనపు ఒత్తిడి పడుతుంది. కాబట్టి, ఈ ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.


గుండె ఆరోగ్యానికి ఏం తినాలి?

గుండెను బలంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

  • నారింజ, ఆపిల్ వంటి కాలానుగుణ పండ్లు

  • ఆకుకూరలు, ఇతర కూరగాయలు

  • ఓట్స్, తృణధాన్యాలు

  • చేపలు, పప్పుధాన్యాలు, గింజలు

  • ఒమేగా-3 ఉన్న ఆహారం.


గుండె ఆరోగ్యానికి మరికొన్ని ముఖ్యమైన సూచనలు

  • రోజూ తేలికపాటి వ్యాయామం చేయండి

  • తగినంత నీరు తాగండి

  • 7-8 గంటలు నిద్రపోండి

  • ఒత్తిడిని తగ్గించుకోండి

  • ధూమపానం, మద్యం మానేయండి

  • బీపీ, షుగర్ తరచుగా చెక్ చేయించుకోండి.


(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)

Also Read:

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ విభజనపై కసరత్తు

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఇప్పటివరకు ఎంతమంది దర్శించుకున్నారంటే..

For More Latest News

Updated Date - Jan 09 , 2026 | 08:26 AM